వర్షంతో సెమీ ఫైనల్ రద్దు: తొలిసారి ఫైనల్ కు చేరిన టిమిండియా

By telugu teamFirst Published Mar 5, 2020, 11:02 AM IST
Highlights

ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. ఇంగ్లాండుతో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచు రద్ద కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఫైనల్ కు చేరుకుంది.

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచుకు వర్షం ఆటంకంగా మారింది. భారత కాలమానం ప్రకారం ఇండియా, ఇంగ్లాండు మధ్య సెమీ ఫైనల్ మ్యాచు గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కురుస్తుండడంతో టాస్ వేయడానికి కూడా వీలు కాలేదు. దాంతో మ్యాచ్ రద్దయింది

వర్షం త్వరగా తెరిపినిస్తే మ్యాచ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఒక వేళ వర్షం ఇలాగే కొనసాగడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దాంతో టీమిండియా ఫైనల్ కు చేరింది. సిడ్నీ క్రికెట్ మైదానంలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మధ్యాహ్నం జరగాల్సి ఉంది. ఇది కూడా రద్దయితే దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుతుంది. దీంతో ఫైనల్ మ్యాచులో ఈ నెల 8వ తేదీ భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్ తలపడుతాయి. 

Also Read: మహిళల ప్రపంచ కప్ సెమీ ఫైనల్: మ్యాచ్ రద్దయితే, ఇండియా స్థితి ఇదీ..

నిబంధనల ప్రకారం... సైమీ ఫైనల్ కు రిజర్వ్ డే లేకపోవడంతో గ్రూప్ స్థాయిల్లో అగ్రస్థానంలో రెండు జట్లు ఫైనల్ కు చేరుతాయి. గ్రూప్ ఏ లో పాయించ్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా గ్రూప్ బీలో అగ్రస్థానంలో నిలించింది. 

ఐసీసీ మహిళల టీ20 మ్యాచులో తొలిసారి టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. 2018 ప్రపంచ కప్ పోటీల్లో సైమీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండుపై తలపడి ఓటమి పాలైంది. దాంతో టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లీగ్ దశలో భారత్ ఆస్ట్రేలిాయ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లను ఓడించింది. దాంతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండు ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

click me!