U19 World Cup 2024 Final: ఆస్ట్రేలియా-భార‌త్ ఫైనల్.. కాంగారుల‌పై ఉదయ్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంటుందా?

By Mahesh Rajamoni  |  First Published Feb 11, 2024, 10:59 AM IST

Under 19 World Cup final: అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (ఫిబ్రవరి 11)బెనోనిలో మధ్యాహ్నం 1:30 నుండి జరుగుతుంది. 6 ఏళ్ల తర్వాత మరోసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. 
 


Australia-India final: అండ‌ర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (ఫిబ్రవరి 11) బెనోనిలో మధ్యాహ్నం 1:30 నుండి జరుగుతుంది. 6 ఏళ్ల తర్వాత మరోసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత అండర్-19 జట్టు 2012, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈసారి కూడా టైటిల్ మ్యాచ్‌లో బలమైన పోటీదారుగా ఉంటుంది. ఇప్ప‌టికే ఐదు సార్లు ప్ర‌పంచ క‌ప్ గెలిచిన యంగ్ ఇండియా 6వ సారి విజ‌యం సాధించాల‌ని చూస్తోంది.

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఓట‌మికి యంగ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? 

Latest Videos

గతేడాది నవంబర్ 19న, ఆస్ట్రేలియన్ జట్టు 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని సీనియర్ భార‌త‌ జట్టును ఓటించింది. అయితే, ఇప్పుడు  ఉదయ్ సహారన్ నేతృత్వంలోని యంగ్ ఇండియా జ‌ట్టు ఆస్ట్రేలియన్ అండర్-19ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. రెండో సెమీస్ స‌మ‌రానికి ముందు కెప్టెన్ సహారాన్ మాట్లాడుతూ, "ఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా పాకిస్తాన్ తలపడుతుందా అనేది పట్టింపు లేదు. మేము ప్రత్యర్థి జట్టుపై దృష్టి పెట్టడం.. మా ఆటపై దృష్టి సారిస్తున్నాము. మేము మ్యాచ్‌లవారీ వ్యూహాన్ని రూపొందించాము. ప్ర‌తి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నామని" తెలిపాడు.

భారత అండర్-19 జట్టు 2012, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఏజ్ గ్రూప్ టోర్నీల్లో భారత జట్టు ఎప్పుడూ 'పవర్‌హౌస్'గా ఉంటూ ఈ టోర్నీలో తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరడం ఇందుకు నిదర్శనం. భారత అండర్-19 జట్టు 2016 నుండి అన్ని ఫైనల్స్ ఆడింది, 2018, 2022 ఎడిషన్లలో టైటిల్స్ గెలుచుకుంది, అయితే 2016, 2020లో ఓడిపోయింది. 2008లో విరాట్ కోహ్లి సారథ్యంలోని జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్‌కు మంచి ఆదరణ లభించింది. లైవ్ టీవీ కవరేజ్, 'స్ట్రీమింగ్' కారణంగా దాని పట్ల క్యూరియాసిటీ మ‌రింత పెరిగింది.

అండర్-19 ప్రపంచకప్ చాలా మంది స్టార్ క్రికెటర్లను అందించింది.. 

అండర్-19 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ క్రికెటర్లు మెరిసి.. భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చారు. ప్ర‌స్తుత అండ‌ర్19 ప్ర‌పంచ క‌ప్ లో సహారాన్ నాయకత్వంలో టీమిండియా ప్రతి మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన మెరుగవుతూ, భారీ తేడాతో విజయం సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కెప్టెన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ రాజ్ లింబానీ, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నమన్ తివారీలో బౌలింగ్ విభాగం బ‌లంగానే ఉంది. 

ఇరు జ‌ట్లు: 

భార‌త్: ఉదయ్ సహారన్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఆరావళి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్) ), ధనుష్. గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

ఆస్ట్రేలియా: హ్యూ వెబ్‌జెన్ (కెప్టెన్), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహాలి బార్డ్‌మ్యాన్, టామ్ క్యాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీప‌ర్), సామ్ కాన్స్టాస్, రాఫెల్ మెక్‌మిలన్, ఐడాన్ ఓకానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రెకర్, కల్లమ్ విడ్లర్, ఒల్లీ పీక్.

click me!