IND vs SL: పంత్‌ బెంచ్‌కే..? బిష్ణోయ్ ప్లేస్‌లో అక్షర్..? లంకతో పోరులో టీమిండియాకు సెలక్షన్ తిప్పలు

Published : Sep 06, 2022, 01:33 PM IST
IND vs SL: పంత్‌ బెంచ్‌కే..?  బిష్ణోయ్ ప్లేస్‌లో అక్షర్..? లంకతో పోరులో టీమిండియాకు సెలక్షన్ తిప్పలు

సారాంశం

Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా నేడు భారత జట్టు శ్రీలంకతో కీలక పోరులో తలపడనున్నది. అయితే ఈ మ్యాచ్ లో ఆడబోయే తుది జట్టు కోసం రోహిత్ అండ్ కో కసరత్తులు చేస్తున్నది.   

సూపర్-4లో తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో  ఓడిన టీమిండియా.. నేడు శ్రీలంకతో ఆడనున్నది. ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గితేనే ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. ఫలితం తేడా వస్తే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో  తుది జట్టుపై రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లు కుస్తీలు పడుతున్నారు.  పాకిస్తాన్ తో మ్యాచ్ లో విఫలమైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ఈ మ్యాచ్ లో  చోటు దక్కేది  అనుమానమే. అతడితో పాటు అదే మ్యాచ్ లో రాణించిన  స్పిన్నర్ రవి బిష్ణోయ్ కు కూడా  లంకతో మ్యాచ్ ఆడే అవకాశం  లేదనే తెలుస్తున్నది. 

తుది జట్టు ఎంపిక భారత్ కు కత్తిమీద సాములా మారింది.  వికెట్ కీపర్ రిషభ్ పంత్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో  14 పరుగులే చేసి  పెవలియన్ చేరాడు.  దీంతో అతడిని లంకతో మ్యాచ్ లో పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అతడికి బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకోవడమే జట్టుకు ఉపయోగమని   ద్రావిడ్, రోహిత్ లు భావిస్తున్నారు.  

తుది జట్టులో ముఖ్యంగా మూడు స్థానాలపై ఆసక్తికర పోటీ నెలకొని ఉంది.  వీరిలో రిషభ్ స్థానంలో  దినేశ్ కార్తీక్.  రవి బిష్ణోయ్ స్థానంలో అక్షర్ పటేల్, దీపక్ హుడా స్థానంలో అవేశ్ ఖాన్. 

పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు స్వల్ప అస్వస్థతతో అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నారు.  అయితే దీపక్ హుడా బ్యాటింగ్ లో 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కానీ భారత్ కు మూడో పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో  లంకతో మ్యాచ్ లో దీపక్ ను పక్కనబెట్టేందుకే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చు.    

ఇక  పాక్ తో మ్యాచ్ లో చోటు దక్కించుకున్న బిష్ణోయ్ కూ శ్రీలంకతో మ్యాచ్ లో అవకాశం  అనుమానమే. పాక్ తో మ్యాచ్ లో బిష్ణోయ్.. బాబర్ ఆజమ్ వికెట్ తీసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ బిష్ణోయ్ కంటే  అక్షర్ పటేల్  ను తీసుకుంటే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా ఉపయోగకరంగా ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.  స్పిన్ ఆల్ రౌండర్ గా  ఉన్న అతడిని ఆడించేందుకే రోహిత్, ద్రావిడ్ లు ఆసక్తి చూపుతున్నారు. అక్షర్ తో పాటు అశ్విన్ ను ఆడిస్తే ఎలా ఉంటుందనేదానిపైనా   రోహిత్, ద్రావిడ్ లు కసరత్తులు చేస్తున్నారు. 

 

లంకతో మ్యాచ్ లో భారత జట్టు అంచనా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,   దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్,  భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !