IND vs SA: కుంబ్లే రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు అడుగుదూరంలో జస్ప్రీత్ బుమ్రా

By Mahesh RajamoniFirst Published Jan 1, 2024, 5:27 PM IST
Highlights

IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ రెండో మ్యాచ్ తో టీమిండియా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో జ‌ర‌గ‌బోయే ఈ మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరిట ఓ భారీ రికార్డును న‌మోదుచేయ‌నున్నాడు.
 

India vs South Africa: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక‌గా భారత్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. టీమిండియా ఇప్పటివరకు 6 మ్యాచ్ ల‌ను ఆడగా, ఆతిథ్య దక్షిణాఫ్రికా 4 మ్యాచ్ ల‌లో విజయం సాధించ‌గా, మ‌రో రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. గత పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఈ మైదానంలో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, ప్ర‌స్తుత మ్యాచ్ లో ఎలాగైన విజయం  సాధించాల‌ని భార‌త్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇక జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ లో భార‌త బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును నెల‌కొల్పే అవకాశ‌ముంది.

తొలి టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టీం ఇండియాకు విజయవంతమైన ఏకైక బౌలర్ గా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక కేప్ టౌన్ లో భారత నంబర్-1 బౌలర్ గా ఎదగడానికి బుమ్రా కేవలం 2 అడుగుల దూరంలో ఉన్నాడు. ఈ మైదానంలో 3 వికెట్లు తీస్తే న్యూలాండ్స్ లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ గా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. కేప్ టౌన్ లో ఇప్ప‌టివ‌ర‌కు 2 మ్యాచ్ ల‌ను ఆడిన బుమ్రా 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మైదానంలో అతను ఒకసారి 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. అత్యుత్తమ స్పెల్ 42 పరుగులకు 5వికెట్లు తీశాడు. వెటరన్ అనిల్ కుంబ్లే ఈ మైదానంలో 3 మ్యాచ్ ల‌లో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ మైదానంలో జవగళ్ శ్రీనాథ్ 2 మ్యాచ్ ల‌లో 12 వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. బుమ్రా మరో 3 వికెట్లు తీస్తే ఈ విషయంలో నెంబర్ వన్ అవుతాడు.

Latest Videos

IND VS SA: మాతో ఆడిన వారిలో స‌చిన్ టెండూల్కరే తోపు.. సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ అలన్ డోనాల్డ్

ఇదిలావుండ‌గా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ధోనీ తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను డ్రా చేసిన రెండో భారత కెప్టెన్ గా రోహిత్ నిలుస్తాడు. అయితే ఈ మైదానంలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి అది అంత సులువు కాద‌ని తెలుస్తోంది.

టెస్టుల‌తో పాటు వ‌న్డేల‌కు గుడ్ బై.. న్యూఇయ‌ర్ వేళ డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ డిసీషన్

click me!