వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా... అజింకా రహానే హాఫ్ సెంచరీ మిస్...

Published : Dec 28, 2021, 02:28 PM ISTUpdated : Dec 28, 2021, 02:42 PM IST
వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా... అజింకా రహానే హాఫ్ సెంచరీ మిస్...

సారాంశం

India vs South Africa: 272/3 స్కోరు వద్ద బ్యాటింగ్ ప్రారంభించి, 34 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టు... నిరాశపర్చిన అశ్విన్, రిషబ్ పంత్...

సెంచూరియన్ టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే వరుసగా 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఓవర్‌నైట్ స్కోరు 272/3 వద్ద బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి నాలుగో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 260 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 123 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రబాడా బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఓవర్ నైట్ స్కోరుకి కేవలం ఒక్క పరుగు మాత్రమే జత చేసి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ (153 పరుగులు) తర్వాత సెంచూరియన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. 

ఆ తర్వాత రెండు ఓవర్లకే అజింకా రహానే  వికెట్ తీశాడు లుంగి ఎంగిడి. 102 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసిన అజింకా రహానే, 2 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గత పర్యటనలో సౌతాఫ్రికాలో ఆడిన చివరి ఇన్నింగ్స్‌లోనూ సరిగా 48 పరుగులే చేశాడు రహానే..

అజింకా రహానే అవుటైన తర్వాత ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్, 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి కేశవ్ మహరాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... శార్దూల్ ఠాకూర్ కూడా 4 పరుగులకే అవుట్ కావడంతో 304 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా. 

ఇందులో ఐదు వికెట్లు లుంగి ఎంగిడి ఖాతాలోనే చేరగా, రబాడా మూడు వికెట్లు తీయడం  విశేషం. అంతకుముందు సౌతాఫ్రికా టూర్‌ను భారత జట్టు మంచి పాజిటివ్‌ ఎనర్జీతో ఆరంభించింది. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది టీమిండియా. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయిన విషయం తెలిసిందే. 

సెంచూరియన్ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెఎల్ రాహుల్ 248 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 122 పరుగులు చేయగా, అజింకా రహానే 81 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

మొదటి రోజు తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా లంచ్ బ్రేక్‌కి వెళ్లిన భారత జట్టు, రెండో సెషన్‌లో మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా వికెట్లను కోల్పోయింది. మూడో సెషన్‌లో దూకుడు పెంచిన భారత జట్టు, విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. ఓవరాల్‌గా తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం భారత్‌దే...

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన మయాంక్ అగర్వాల్...123 బంతుల్లో, 9 ఫోర్లతో 60 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

సౌతాఫ్రికాలో టీమిండియా ఇప్పటిదాకా 21 టెస్టులు ఆడగా... ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడం ఇది మూడోసారి. ఇంతకుముందు 2006-07 పర్యటనలో కేప్ టౌన్ టెస్టులో వసీం జాఫర్, దినేశ్ కార్తీక్ కలిసి తొలి వికెట్‌కి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

117 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా... మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాతి బంతికే ఛతేశ్వర్ పూజారా, భువుమాకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.  94 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఎంగిడి బౌలింగ్‌లో ముల్దార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు