The Ashes: ఆ ట్వీట్ ను చూపుతూ మైకెల్ వాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన టీమిండియా మాజీ ఓపెనర్..

Published : Dec 28, 2021, 01:20 PM IST
The Ashes: ఆ ట్వీట్ ను చూపుతూ మైకెల్ వాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన టీమిండియా మాజీ ఓపెనర్..

సారాంశం

Wasim Jaffer Trolls Michael Vaughn: యాషెస్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా  మెల్బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆ జట్టు 68 పరుగులకే చాప చుట్టేసింది. 

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ఆసీస్ చేతిలో ఇంగ్లాండ్ ఘోర ఓటమి ఎదుర్కొంది. దీంతో ఆ జట్టుపై స్వంత దేశంలోని ఆటగాళ్లే గాక ఇతర దేశాలకు చెందిన మాజీలు కూడా విమర్శల  వర్షం కురిపిస్తున్నారు. ఇక తనకు సంబంధం లేకున్నా చీటికి మాటికి  టీమిండియా పై  ట్వీట్లు పారేసుకునే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ను  భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ దారుణంగా ట్రోల్ చేశాడు. వాన్.. గతంలో భారత జట్టుపై వ్యంగ్యంగా విమర్శిస్తూ చేసిన ట్వీట్ ను  చూపించి ఓ ఆటాడుకున్నాడు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..? 

2019లో భారత జట్టు న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో  మైకెల్ వాన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘92 కే టీమిండియా ఆలౌట్.. ఈ రోజుల్లో ఏ జట్టైనా వంద పరుగుల కంటే తక్కువ చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను..’ అని ట్వీటాడు. 

 

ఇక ఇప్పుడు ఇదే ట్వీట్ ను చూపిస్తూ వసీం జాఫర్.. వాన్ ను  ట్రోల్ చేశాడు. యాషెస్ మూడో  టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 68 పరుగులకే ఆలౌట్ అయింది.  దీంతో వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను ఉంచుతూ.. ‘ఇంగ్లాండ్  68 కే ఆలౌట్..’అని కామెంట్ పెట్టడమే గాక దానిని మైకెల్ వాన్ కు ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఈ ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ పై ట్రోల్స్ చేస్తూ ఆ జట్టు ఆటగాళ్లను ఓ ఆటాడుకుంటున్నారు. ఇదిలాఉండగా మైకెల్ వాన్ కూడా వసీం జాఫర్ ట్వీట్ కు రిప్లై ఇవ్వడం గమనార్హం. జాఫర్ షేర్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ‘వెరీ గుడ్ వసీం...’ అని ట్వీటాడు. 

ఇక 31 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద మూడో రోజు ఆట   ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేదు.  ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే  మిచెల్ స్టార్క్..  బెన్ స్టోక్స్ (11) ను పెవిలియన్ కు  పంపించి మూడో  రోజు ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. ఇక ఆ తర్వాత బంతి అందుకున్న బోలాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 4 ఓవర్లే వేసిన అతడు ఓ ఓవర్ మేడిన్ వేయడమే గాక ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సిరీస్ లో మరో రెండు మ్యాచులు మిగిలుండగానే ఆసీస్.. యాషెస్ ను 3-0తో గెలుచుకుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు