
భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భార్య, హైదరాబాద్ మాజీ మోడల్ సఫా బేగ్... రెండోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకుముందే వీరికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అనే కొడుకు ఉన్నాడు. 2016, డిసెంబర్ 20న ఇమ్రాన్ ఖాన్ పఠాన్ జన్మించగా... సరిగ్గా ఐదేళ్లకు మళ్లీ డిసెంబర్‌లో రెండోసారి మగబిడ్డకు తండ్రి అయ్యారు ఇర్ఫాన్ పఠాన్ దంపతులు...
రెండో కొడుక్కి ‘సులేమాన్ ఖాన్’ అంటూ నామకరణం చేసిన ఇర్ఫాన్ పఠాన్, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేశాడు. ఇర్ఫాన్ పఠాన్ అన్న యూసఫ్ పఠాన్, తమ్ముడికి శుభాకాంక్షలు తెలియచేశాడు.
కెరీర్ ఆరంభంలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్, ఆ తర్వాత తుదిజట్టులో చోటు కోల్పోయాడు...2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడి మొత్తంగా 300 వికెట్లు, 3 వేల దాకా పరుగులు చేశాడు...
2012లో చివరిగా టీమిండియా తరుపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్, 2020 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అంటే దాదాపు 8 ఏళ్ల పాటు భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూశాడు ఇర్ఫాన్ పఠాన్...
2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటుతోనూ బాల్‌తోనూ రాణించి, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు ఇర్ఫాన్ పఠాన్... భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ యాక్షన్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి ఓవర్‌లోనే వికెట్లు తీయడం ఇర్ఫాన్ పఠాన్ ప్రత్యేకత.
అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫోటోలు పోస్టు చేసే ఇర్ఫాన్ పఠాన్, భార్య ముఖాన్ని మాత్రం చూపించడం లేదు. కొన్నాళ్ల క్రితం కొడుకును ఎత్తుకుని, భార్య పక్కనే నిల్చొని ఉన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌నాటి ఫోటోను పోస్టు చేసిన ఇర్ఫాన్ పఠాన్, ఆ ఫోటోలో సఫా బేగ్ ముఖాన్ని మాత్రం కనిపించకుండా బ్లర్ చేశాడు. దానికిముందు ఇర్ఫాన్ పఠాన్ పోస్టు చేసిన చాలా ఫోటోల్లో ఆమె ముఖం కనిపించదు.
‘నా భార్యకు ముఖాన్ని చూపించడం ఇష్టం లేదు. నా అకౌంట్ నుంచి పోస్టు చేసే ఫోటోల్లో చాలావరకూ ఆమెనే పోస్టు చేస్తుంది. తను ముఖం చూపించాలని ఉంటే చూపిస్తుంది లేదంటే లేదు. నేను ఆమెకి భర్తని మాత్రమే, మాస్టర్‌ను కాదు’ అంటూ సమాధానం ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.
సౌదీ అరేబియాకు చెందిన సఫా బేగ్, పెళ్లికి ముందు అక్కడ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సౌదీ సంప్రదాయం ప్రకారం అక్కడి మహిళలు పెళ్లైన తర్వాత పరాయి వ్యక్తులకు ముఖం చూపించకూడదు.
అదీకాకుండా పెళ్లైన కొత్తలో ఇర్ఫాన్ పఠాన్ పోస్టు చేసిన భార్య ఫోటోపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చాలామంది మత ఛాందసవాదులు, భార్య ఫోటోను ఇలా పోస్టు చేస్తావా? మన సంప్రదాయం గురించి తెలీదా? అంటూ కామెంట్లు చేశారు. ఈ సంఘటనతో బాగా అప్‌సెట్ అయిన సఫా బేగ్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడు తన భర్తకు సంబంధించిన విషయాలు, ఫోటోలు పోస్టు చేసిన తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతోంది.