India vs England: భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ బాజ్ బాల్ తో గేమ్ తో తొలి రోజు 300 పరుగుల మార్క్ ను అందుకుంది. ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు.
India vs England : రాంచీ వేదికగా జరుగుతున్న భారత్ -ఇంగ్లాండ్ 4 టెస్టులో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ సెంచరీతో అదరగొట్టాడు. భారత్ తో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ లోని తొలి మూడు మ్యాచ్ లలో జో రూట్ పెద్దగా పరుగులు సాధించేదు. కేవలం 77 పరుగులు మాత్రమే కొట్టాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ రాంచీ టెస్టులో జో రూట్ పాత ఫామ్ ను కొనసాగిస్తూ.. సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. 219 బంతుల్లో 31వ టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాల్గో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి జో రూట్ 106 పరుగులతో నాటౌగ్ గా నిలిచాడు.
భారత్ పై అత్యధిక సెంచరీలు..
undefined
టెస్టు క్రికెట్ లో భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా జో రూట్ నిలిచాడు. ఇది అతనికి 10వ సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ భారత్ పై 9 టెస్టు సెంచరీలు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో 19 వేల పరుగులు..
భారత్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టడంతో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ అంతర్జాతీయ క్రికెట్లో 19 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. జో రూట్ 92 పరుగులు చేసిన వెంటనే ఈ ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ గా, ప్రపంచంలో 14వ బ్యాట్స్ మన్ గా ఘనత సాధించాడు.
రోహిత్ శర్మ రికార్డు సమం..
జో రూట్ భారత్ పై అంతకుముందు 9 సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్ లో 219 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టెస్టు కెరీర్ విషయానికొస్తే అతడికి ఇది మూడో స్లో సెంచరీ కావడం గమనార్హం. అలాగే, క్రియాశీల బ్యాట్స్ మన్ లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు జోరూట్. రూట్ కు ఇది 47వ సెంచరీ. అంతర్జాతీయ మ్యాచ్ లలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 47 సెంచరీలు సాధించాడు.
IND VS ENG : ఆరంభం అదిరింది.. ఇంగ్లాండ్ ను దెబ్బతీసి.. ఎవరీ ఆకాశ్ దీప్.. ?