INDvsENG: పూజారా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

Published : Feb 09, 2021, 10:02 AM IST
INDvsENG: పూజారా అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...

సారాంశం

15 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా... 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా... ఇంకా విజయానికి 358 పరుగుల దూరంలో భారత జట్టు...

చెన్నై టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకి 39/1 వద్ద ఐదోరోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మరో 19 పరుగులు జోడించిన తర్వాత పూజారా వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కోల్పోయిన రెండు వికెట్లు జాక్ లీచ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ 60 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది టీమిండియా.

భారత జట్టు విజయానికి ఇంకా 362 పరుగులు కావాలి. భారత సారథి విరాట్ కోహ్లీ రాణించడంపైనే ఫలితం ఆధారపడి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్
ధోనికే థ్యాంక్స్.. నా ఆటను మార్చింది అతడే.. దూబే సంచలన వ్యాఖ్యలు