IL T20: నేటి నుంచే మరో టీ20 లీగ్.. మినీ ఐపీఎల్లే కానీ కాస్త డిఫరెంట్.. ఆసక్తికర విషయాలివిగో..

Published : Jan 13, 2023, 05:33 PM ISTUpdated : Jan 13, 2023, 05:35 PM IST
IL T20: నేటి నుంచే మరో టీ20 లీగ్.. మినీ ఐపీఎల్లే కానీ కాస్త డిఫరెంట్.. ఆసక్తికర విషయాలివిగో..

సారాంశం

IL T20 LIVE: ఇప్పటికే   దేశానికో  క్రికెట్ లీగ్ పుట్టుకొస్తున్న తరుణంలో తాము  అందుకు వెనుకాడబోమని గల్ఫ్ దేశం యూఏఈ కూడా రంగంలోకి దిగింది.  నేటి నుంచే అక్కడ ఇంటర్నేషనల్ లీగ్ (ఐఎల్ టీ20) మొదలుకాబోతుంది. 

ఐపీఎల్,  బీబీఎల్, బీపీఎల్, పీఎస్ఎల్,  ఎస్ఎ 20 వంటి లీగ్‌లతో  క్రికెట్ అభిమానులు నిత్యం ఏదో ఒక మ్యాచ్  చూస్తూ ఆటను ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటికిప్పుడు  ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) తో పాటు ఈ ఏడాదే మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ టీ20), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో కూడా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పుడు  తాజాగా మరో  లీగ్ కూడా క్రికెట్ అభిమానులను అలరించనుంది.  నేటి నుంచే  ఎడారి దేశం యూఏఈ వేదికగా   ఇంటర్నేషనల్  లీగ్ టీ20 (ఐఎల్ టీ20) ప్రారంభం కాబోతుంది. 

ఎస్ఎ టీ20ని మినీ ఐపీఎల్ గా వ్యవహరిస్తున్నారు.  ఎందుకంటే  అక్కడ  ఉన్న జట్లన్నీ  ఐపీఎల్ ఓనర్లవే.   ఐఎల్ టీ20 లో కూడా  ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి.  ఆరు జట్లతో బరిలోకి దిగుతున్న  ఈ లీగ్ లో  ముంబై, ఢిల్లీతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ లైన్ కూడా పెట్టుబడులు పెట్టింది. 

ఆరు టీమ్ లలో 4 మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలవే. కానీ ఎస్ఎ టీ20 లీగ్ మాదిరిగా పూర్తిగా మినీ ఐపీఎల్ అయితే కాదు.  నేటి నుంచి ఈ లీగ్ మొదలుకానున్న నేపథ్యంలో షెడ్యూల్,  కెప్టెన్స్ ఎవరు..?, టీమ్స్  వివరాలు ఇక్కడ చూద్దాం. 

షెడ్యూల్ : 
- జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ టోర్నీ ఫిబ్రవరి  12 వరకు జరుగుతుంది. ఆరు  టీమ్స్ మొత్తం 34 మ్యాచ్ లు  ఆడతాయి. ఆ తర్వాత  ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఉంటాయి.  యూఏఈలోని ఆరు వేదికలలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.  

టీమ్స్, ఓనర్స్ : 
- ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) 
- అబుదాబి నైట్ రైడర్స్ (కోల్కతా నైట్ రైడర్స్) 
- డిసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ)
- దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) 
- గల్ఫ్ జెయింట్స్ (అదానీకి చెందిన టీమ్ ఇదే) 
- షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) 

కెప్టెన్లు : 
- ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్  
- అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్  
- డిసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో 
- దుబాయ్ క్యాపిటల్స్ - రొవ్మన్ పావెల్  
- గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ వీన్స్  
- షార్జా వారియర్స్ - మోయిన్ అలీ 

 

ఎస్ఎ టీ20 లీగ్ వల్ల దక్షిణాఫ్రికా ఆటగాళ్లంతా ఈ లీగ్ లోనే ఉన్నారు. కొంతమంది ఇంగ్లాండ్ స్టార్లు కూడా ఇదే లీగ్ లో ఆడుతున్నారు. అయినా  ఐఎల్ టీ20 లో  స్టార్లకు కొదవలేదు. ఎక్కడ టీ20 టోర్నీ జరిగినా ముందుండే విండీస్ ఆటగాళ్లు సునీల్ నరైన్, పొలార్డ్, డ్వేన్ బ్రావో, పావెల్, షిమ్రాన్ హెట్మెయర్  తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మోయిన్ అలీ,  జో రూట్, క్రిస్ జోర్డాన్,  జేమ్స్ వీన్స్, లంక కెప్టెన్ దసున్ శనక,  వనిందు హసరంగ,  కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్లకు కొదవలేదు. 

లైవ్ ఇలా చూడొచ్చు.. 

- ఐఎల్ టీ20 లీగ్ ను జీ నెట్‌వర్క్స్ లో వీక్షించొచ్చు.  ఇంగ్లీష్ ,హిందీ, తమిళ్ లో ప్రసారాలున్నాయి.  జీ సినిమా, జీ అన్మోల్, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ లతో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో  చూడొచ్చు. 

 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !