రోహిత్ శర్మ ఆడకపోతే, నేను టీవీ ఆఫ్ చేసేస్తా... మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

Published : Mar 13, 2021, 11:41 AM IST
రోహిత్ శర్మ ఆడకపోతే, నేను టీవీ ఆఫ్ చేసేస్తా... మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

సారాంశం

జనాలు రోహిత్ బ్యాటింగ్ చూడడానికే స్టేడియానికి వస్తారు... ఓ అభిమానిగా రోహిత్ శర్మ టీమ్‌లో లేకపోతే నేను టీవీ ఆఫ్ చేసేస్తాను...  మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్... 

టెస్టు సిరీస్‌లో ఓ భారీ సెంచరీతో పాటు అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు మొదటి టీ20 నుంచి విశ్రాంతి కల్పించింది. రోహిత్ శర్మ లేని టీమిండియా టాపార్డర్ 5 పరుగులకే పెవిలియన్ చేరింది.

కెఎల్ రాహుల్ 1, శిఖర్ ధావన్ 4 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు. గత ఐదేళ్లలో టీమిండియా టాపార్డర్‌ 5 పరుగుల లోపే అవుట్ కావడం ఇదే తొలిసారి.  రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని మ్యాచ్‌కి ఒకరోజు ముందు ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే టీమిండియా ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... ‘రోహిత్ శర్మ ఓ అద్భుతమైన హిట్టర్. అతని హిట్టింగ్ నాకు చాలా ఇష్టం. జనాలు రోహిత్ బ్యాటింగ్ చూడడానికే స్టేడియానికి వస్తారు. ఓ అభిమానిగా రోహిత్ శర్మ టీమ్‌లో లేకపోతే నేను టీవీ ఆఫ్ చేసేస్తాను... మ్యాచ్ చూడను’ అంటూ కామెంట్ చేశాడు. వీరూ కామెంట్‌తో ‘హిట్ మ్యాన్’ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !