విరాట్ కోహ్లీ డకౌట్.. భలేగా వాడుకుంటున్న పోలీసులు

By telugu news teamFirst Published Mar 13, 2021, 8:03 AM IST
Highlights

హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూనే... విరాట్ కోహ్లీ డకౌట్ పై పంచ్ వేయడం గమనార్హం.

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు  చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో  ఉత్తరాఖండ్ పోలీసులు విరాట్ కోహ్లీ పేరు చెప్పి.. హెల్మెట్ ఉపయోగాన్ని వివరించడం గమనార్హం.

హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూనే... విరాట్ కోహ్లీ డకౌట్ పై పంచ్ వేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే...

ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంలో ఆయనను  చాలా మంది ట్రోల్ చేశారు. అభిమానులు సైతం కోహ్లీ ఆట పట్ల నిరాశ వ్యక్తం చేశారు. కాగా... తాజాగా.. ఆయన డకౌట్ ని ఉత్తరాఖండ్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ వివరించడానికి ప్రయత్నించడం గమనార్హం.

‘ హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రమాదం.. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. లేకపోతే...  విరాట్ కోహ్లీలాగే మీరు కూడా డకౌట్ అవుతారు’ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం గమనార్హం. హిందీలో వారు పెట్టిన పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

हेलमेट लगाना ही काफ़ी नहीं है!
पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. pic.twitter.com/l66KD4NMdG

— Uttarakhand Police (@uttarakhandcops)

 

click me!