ఒక్కరి పేరు చెబితే గొడవైపోతుంది! పాక్ టీమ్‌లో అందరూ మంచి బౌలర్లే... రోహిత్ ఆన్సర్‌కి రితికా ఫన్నీ రియాక్షన్

Published : Aug 08, 2023, 07:04 PM IST
ఒక్కరి పేరు చెబితే గొడవైపోతుంది! పాక్ టీమ్‌లో అందరూ మంచి బౌలర్లే... రోహిత్ ఆన్సర్‌కి రితికా ఫన్నీ రియాక్షన్

సారాంశం

పాకిస్తాన్ టీమ్‌లో అందరు బౌలర్లు బాగానే వేస్తారు. ఏ ఒక్కరి పేరు చెప్పలేను... ఒకరి పేరు చెబితే, మరో బౌలర్ ఫీల్ అవ్వొచ్చు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ సమాధానం.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలబడనుంది టీమిండియా. దసరా నవరాత్రుల కారణంగా ఈ మ్యాచ్ అక్టోబర్ 14కి వాయిదా పడొచ్చు. ఈ మ్యాచ్‌‌ క్రేజ్‌కి అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్ ధరలు ఆకాశాన్ని తాకాయి.. హోటల్ రూమ్స్ దొరక్క ఆసుపత్రి బెడ్స్‌ని బుక్‌ని అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ముందు వెస్టిండీస్ టూర్‌కి వెళ్లిన టీమిండియా, ప్రస్తుతం అక్కడ టీ20 సిరీస్ ఆడుతోంది. టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రాగా, కెప్టెన్ రోహిత్ శర్మ, కుటుంబంతో కలిసి యూఎస్‌ఏ టూర్‌కి వెళ్లాడు... 

అమెరికాలో రోహిత్ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన టీమిండియా కెప్టెన్, అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.. ‘పాకిస్తాన్ టీమ్‌లో బెస్ట్ బౌలర్ ఎవరు? ’ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు రోహిత్ శర్మ.. 

‘పాకిస్తాన్ టీమ్‌లో అందరు బౌలర్లు బాగానే వేస్తారు. ఏ ఒక్కరి పేరు చెప్పలేను. ఎందుకంటే అది చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఒకరి పేరు చెబితే, మరో బౌలర్ ఫీల్ అవ్వొచ్చు. అతని పేరుతో ఇంకో బౌలర్ ఫీల్ కావచ్చు. నాకు తెలిసి పాకిస్తాన్ బౌలర్లు అందరూ బాగానే వేస్తారు.. ’ అంటూ సమాధానం ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

ఈ కార్యక్రమానికి హాజరైన రోహిత్ శర్మ భార్య రితికా సాగ్జే, ఈ మాటలకు నవ్వు ఆపుకోలేకపోయింది. ముందు వరుసలో కూర్చొన్న రితిక, నవ్వుతూ తలదించుకోవడం కెమెరాల్లో కనిపించింది...

పాకిస్తాన్‌‌తో జరిగిన 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2014 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి సయ్యద్ అజ్మల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

2016 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌‌తో మ్యాచ్‌లో 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో అవుటైన రోహిత్ శర్మ, 2015 వన్డే వరల్డ్ కప్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సోహైల్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ బౌలింగ్‌లో అవుటైన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి... హసన్ ఆలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..

2021 టీ20 వరల్డ్ కప్‌లో షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటైన రోహిత్ శర్మ, 2022 టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో 7 బంతుల్లో 4 పరుగులు చేసి హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆసియా కప్ 2022 టోర్నీ గ్రూప్ మ్యాచ్‌లో 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో అవుటైన రోహిత్, సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి హారీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !