విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్, మిచెల్ మార్ష్ డకౌట్... సచిన్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్..

By Chinthakindhi Ramu  |  First Published Oct 8, 2023, 3:03 PM IST

వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ  రికార్డు... జస్ప్రిత్ బుమ్రాకి మొదటి వికెట్.. 


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో డేవిడ్ వార్నర్ బౌండరీ బాదాడు. మూడో ఓవర్‌లో మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.

6 బంతులు ఆడిన మిచెల్ మార్ష్, పరుగులేమీ చేయకుండానే విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ..

Latest Videos

ఇండియాతో వరల్డ్ కప్ మ్యాచ్‌లో డకౌట్ అయిన మొట్టమొదటి ఆస్ట్రేలియా ఓపెనర్‌గా మిచెల్ మార్ష్ నిలిస్తే, ఆసీస్ ఓపెనర్‌ని డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు..

వన్డేల్లో అత్యధిక క్యాచులు పట్టుకున్న భారత ఫీల్డర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, వన్డే వరల్డ్ కప్‌లో, మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఫీల్డర్‌గా నిలవడం విశేషం. 

విరాట్ కోహ్లీకి ఇది 15వ క్యాచ్ కాగా ఇంతకుముందు అనిల్ కుంబ్లే 14, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ 12 క్యాచులు అందుకున్నారు.  మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో 3 ఫోర్లు రాబట్టింది ఆస్ట్రేలియా..


వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, ఏబీ డివిల్లియర్స్ 20 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేస్తే, డేవిడ్ వార్నర్‌కి ఇది 19వ వరల్డ్ కప్ ఇన్నింగ్స్. 

ఓవరాల్‌గా ఇంతకుముందు రికీ పాంటింగ్ (1743), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1985), మార్క్ వా (1004) తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో 1000 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్...  

click me!