బాబర్ ఆజాం ఆధిపత్యానికి చెక్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో శుభ్‌మన్ గిల్ .. ఆ రికార్డు కూడా

By Siva Kodati  |  First Published Nov 8, 2023, 2:38 PM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ల విభాగంలో భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ప్లేస్‌లో నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం
ను గిల్ వెనక్కి నెట్టాడు. శుభ్‌మన్ మొత్తం 830 రేటింగ్ పాయింట్లను పొందగా.. బాబర్ 824 పాయింట్ల వద్ద వున్నాడు.


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ల విభాగంలో భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఈ ప్లేస్‌లో నిలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం
ను గిల్ వెనక్కి నెట్టాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 

ఈ ప్రపంచకప్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌లో వున్నాడు. శ్రీలంకపై 92 పరుగులు, దక్షిణాఫ్రికాతో పోరులో 23 పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 219 పరుగులు చేశాడు. దాదాపు 951 రోజుల పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిన బాబర్ ఆజాం ఇప్పుడు కిందకి దిగాల్సి వచ్చింది. పాక్ కెప్టెన్.. ఈ టోర్నీలో ఇంకా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 8 మ్యాచ్‌లు ఆడి 282 పరుగులు మాత్రమే చేయడంతో ఆరు రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. దీంతో గిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

Latest Videos

శుభ్‌మన్ మొత్తం 830 రేటింగ్ పాయింట్లను పొందగా.. బాబర్ 824 పాయింట్ల వద్ద వున్నాడు. ఈ ఏడాది 26 వన్డేల్లో 63 సగటుతో 1149 పరుగులు చేశాడు. అంతేకాదు.. అతని స్ట్రైక్ రేట్ 103.72 . ఇది ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు ఆటగాళ్లే కంటే కూడా అత్యధికం. బాబర్ విషయానికి వస్తే.. ఈ ప్రపంచకప్‌లో అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 40.28 సగటుతో 282 పరుగులు మాత్రమే సాధించాడు. 

మరోవైపు.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మహ్మద్ సిరాజ్ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు  పడగొట్టిన సిరాజ్ జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐదో స్థానానికి పడిపోయి షాహీన్ ఆఫ్రిదితో కలిసి ఆ ప్లేస్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికా బలౌర్ కేశవ్ మహరాజ్ సెకండ్ ప్లేస్‌లో వున్నాడు. 

click me!