సౌతాఫ్రికా - నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వరుణుడి దోబూచులాట... ఓవర్లు కుదించిన అంపైర్లు..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా... వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా మొదలైన మ్యాచ్,  43 ఓవర్లకు మ్యాచ్‌ని కుదించిన అంపైర్లు..


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ధర్మశాలలో సౌతాఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌తో వరుణుడు దోబూచులాట ఆడుతున్నాడు. షెడ్యూల్ సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సరిగ్గా మ్యాచ్ సమయానికి వర్షం కురవడంతో మ్యాచ్‌ని 20 నిమిషాలు వాయిదా వేశారు. వర్షం తగ్గిన తర్వాత కూడా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి సమయం పట్టింది...

టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.  ఇరు జట్లు క్రీజులోకి వచ్చేందుకు రెఢీ అవుతుండగా మళ్లీ వర్షం కురిసింది. ఇలా రెండు సార్లు తగ్గి, ఆగి అంతరాయం కలిగించడం వల్ల 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 4 గంటలకు ప్రారంభమైంది..

Latest Videos

వర్షం కారణంగా విలువైన సమయం కోల్పోవడంతో 43 ఓవర్లకు మ్యాచ్‌ని కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. 9 ఓవర్ల పాటు మొదటి పవర్ ప్లే ఉంటుంది. 36-43 ఓవర్ల మధ్య చివరి పవర్ ప్లే ఉంటుంది. ముగ్గురు బౌలర్లు తొమ్మిదేసి ఓవర్లు, ఇద్దరు బౌలర్లు 8 ఓవర్లు వేయవచ్చు..

సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, తెంబ భవుమా (కెప్టెన్), రస్సీ వాన్ దేర్ దుస్సేన్, అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఇంగిడి, గెరాల్డ్ కోట్జీ

నెదర్లాండ్స్ జట్టు: విక్రమ్‌జీత్ సింగ్, మ్యాక్స్‌ ఓడార్డ్, కోలిన్ అకీర్‌మన్, బస్ దే లీడే, తేజ నిడమనురు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సేబ్రాండ్ ఎంజెబ్రెట్జ్, లోగన్ వాన్ బ్రీక్, రోల్ఫ్ వాన్ దేర్ మార్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మికీరన్

click me!