South Africa vs Australia: 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా... వర్షం కారణంగా ఆగిన ఆట..
కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా... 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తెంబ భవుబాని మొదటి ఓవర్‌లోనే డకౌట్ చేశాడు మిచెల్ స్టార్క్...
వరల్డ్ కప్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్ డి కాక్ 3 పరుగులు చేసి, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
31 బంతులు ఆడి 6 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా..
వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సమయానికి 14 ఓవర్లు బ్యాటింగ్ చేసి 44/4 పరుగులు చేసింది సౌతాఫ్రికా. ఈ రోజు ఆట సాధ్యం కాకపోతే రేపు రిజర్వు డేలో మ్యాచ్ జరుగుతుంది. రేపు కూడా ఆట సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా... ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది..