ICC World cup 2023: టాస్ గెలిచిన సౌతాఫ్రికా... మొదటి ఫైనల్ ఆడాలని సఫారీలు, మరోసారి ఫైనల్ వెళ్లాలని ఆస్ట్రేలియా

By Chinthakindhi Ramu  |  First Published Nov 16, 2023, 1:55 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా! తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిచిన సఫారీ టీమ్..  ఇప్పటికే రెండు సార్లు సెమీ ఫైనల్స్‌లో తలబడిన ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా..


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిచింది.  ఐదు సార్లు తొలుత బ్యాటింగ్ చేసి విజయాలు అందుకున్న సౌతాఫ్రికా, రెండో సారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన రెండు మ్యాచుల్లో ఓడిపోగా మరో రెండు మ్యాచుల్లో చచ్చీ చెడి గెలిచి... సెమీస్‌కి వచ్చింది. 

Latest Videos

మరోవైపు తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుసగా 7 విజయాలు అందుకుని సెమీ ఫైనల్‌కి వచ్చింది. ఇరుజట్ల మధ్య లక్నోలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 134 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది..

సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడడం ఇది మూడోసారి. 1999 వన్డే వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఈ రెండు జట్లు తొలిసారి తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 213 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా కూడా సరిగ్గా 213 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లీగ్ స్టేజీలో ఎక్కువ మ్యాచులు గెలిచిన కారణంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్లింది..

2007 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా. సౌతాఫ్రికాపై సెమీస్ గెలిచిన రెండు సార్లు, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టైటిల్స్ కూడా గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో 7 ఫైనల్స్ ఆడి, 5 సార్లు టైటిల్ గెలిచింది. సౌతాఫ్రికా నాలుగు సార్లు సెమీ ఫైనల్స్ ఆడినా ఫైనల్ మాత్రం వెళ్లలేకపోయింది. దీంతో మొదటిసారి ఫైనల్ ఆడాలని సౌతాఫ్రికా, 8వ సారి ఫైనల్‌కి వెళ్లాలని ఆస్ట్రేలియా.. సెమీస్‌లో తలబడుతున్నాయి.

 

click me!