ICC World cup 2023: బుమ్రా బూమ్.. షమీ సెన్సేషన్! 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 29, 2023, 7:26 PM IST

వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, అదే మ్యాజిక్ రిపీట్ చేసిన మహ్మద్ షమీ.. 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 


భారత జట్టుకి 229 పరుగులకే పరిమితం చేశామనే ఆనందం, ఇంగ్లాండ్‌కి ఎక్కువ సేపు నిలవలేదు. స్వల్ప లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో ఆఖరి బంతికి జానీ బెయిర్‌స్టో ఫోర్ బాదాడు. మహ్మద్ సిరాజ్ ఓవర్‌లో 6, 4 బాదిన మహ్మద్ సిరాజ్ 13 పరుగులు రాబట్టాడు..

17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జో రూట్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు క్లియర్‌గా కనిపించడంతో నిరాశ తప్పలేదు..

Latest Videos

undefined

10 బంతులు ఆడిన బెన్ స్టోక్స్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మొదటి ఓవర్‌లో 3 పరుగులు ఇచ్చిన షమీ, తన రెండో ఓవర్‌లో వికెట్ మెయిడిన్ వేశాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల కోల్పోయి 34 పరుగులు చేసింది ఇంగ్లాండ్. 8వ ఓవర్ ఆఖరి బంతికి షమీని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ, 10వ ఓవర్ మొదటి బంతికి జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి బెయిర్ స్టో అవుట్ కావడంతో 39 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్... 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి  229 పరుగుల స్కోరు చేయగలిగింది.. రోహిత్ శర్మ 87, సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి భారత జట్టుకి మంచి స్కోరు అందించారు.. 

శుబ్‌మన్ గిల్ 9 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.  శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి అవుట్ కావడంతో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి నాలుగో వికెట్‌కి 91 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. రవీంద్ర జడేజా 8. మహ్మద్ షమీ 1 పరుగు చేయగా 46 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా స్కోరుని 200+ మార్కు దాటించి అవుట్ అయ్యాడు..

click me!