ICC World Cup 2023: సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరంగా ఆ అంపైర్.. టీమిండియా గెలుపు ఖాయమంటున్న ఫ్యాన్స్

By Sumanth Kanukula  |  First Published Nov 15, 2023, 9:57 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరింది. ఈరోజు తొలి సెమీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్‌ జరగనుంది.


వన్డే వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరింది. ఈరోజు తొలి సెమీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ మ్యాచ్ గురించే చర్చ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించడంతో.. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఓ సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారని ఐసీసీ ప్రకటించింది. అదేవిధంగా థర్డ్‌ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్‌ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ విధులు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను నియమించింది.

Latest Videos

undefined

అయితే ఈ మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉండబోడని తెలుసుకున్న టీమిండియా అభిమానులు సంబరపడిపోతున్నారు. సెంటిమెంట్ పరంగా ఇది టీమిండియా విజయానికి కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్‌ గెలవడం ఖాయమని చెబుతున్నారు. అందుకు కారణాన్ని కూడా చెబుతున్నారు. 2014 నుండి నాకౌట్ దశలో టీమిండియా ఐదు ఓటములలో రిచర్డ్ కెటిల్‌బరో  అంపైర్ ఉన్నాడు. ఈ జాబితాలో.. 2019 వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఘోర పరాజయం కూడా ఉంది.

 

"Richard Kettleborough name is not present in IND vs NZ SF's umpires list"

Wow !!!

I can already picture IND team playing the final in Motera stadium and Rohit lifting the trophy

— msd_stan (@bdrijalab)

Thank God
There is no Richard kettleborough
India biggest nightmare is gone now
Surely going to finals

— Manish Sehrawat (@ManishS63614113)

ఈ క్రమంలోనే ఈరోజు జరగనున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘‘IND vs NZ సెమీఫైనల్ అంపైర్ల జాబితాలో రిచర్డ్ కెటిల్‌బరో పేరు లేదు. వావ్ !!!. నేను ఇప్పటికే మోతేరా స్టేడియంలో ఇండియా జట్టు ఫైనల్ ఆడుతున్నట్లు, రోహిత్ ట్రోఫీని ఎత్తడం పిక్చరైజ్ చేసుకుంటున్నాను’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. చాలా మంది కూడా ఇదేరకంగా కామెంట్స్ చేస్తున్నారు.

click me!