ఆ రోజు కోహ్లీని అవుట్ చేసి ఉంటే, మేమే గెలిచేవాళ్లం! అతనితోనే అసలు సమస్య... - ప్యాట్ కమ్మిన్స్

By Chinthakindhi Ramu  |  First Published Nov 18, 2023, 5:07 PM IST

చెన్నై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకుని ఉంటే, మేం ఈజీగా గెలిచేవాళ్లం.... ఈ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు...’  - ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్..


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తొలి రెండు మ్యాచుల్లో పరాజయాలను ఎదుర్కొంది ఆస్ట్రేలియా. చెన్నైలో అక్టోబర్ 8న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 49.3 ఓవర్లలో 199 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  ఈ లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే విరాట్ కోహ్లీ 85 పరుగులు, కెఎల్ రాహుల్ 97 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. ఆస్ట్రేలియా తరుపున ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాలతో మొదటి మ్యాచ్‌లో ఆడలేదు. అలాగే డెంగ్యూ బారిన పడిన భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ఆసీస్‌తో మ్యాచ్ ఆడలేదు. 

Latest Videos

undefined

హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉండడంతో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. టీమిండియాతో వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...

‘చెన్నై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకుని ఉంటే, మేం ఈజీగా గెలిచేవాళ్లం. విరాట్ కోహ్లీ వికెట్ ఎంత ముఖ్యమో మాకు బాగా తెలుసు. అహ్మదాబాద్ పిచ్‌ని గమనించాను. అది చాలా బాగుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ ఆడిన పిచ్ మీద ఆడబోతున్నామనుకుంటా..

మహ్మద్ షమీ, టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అతన్ని మేం ఫేస్ చేసి చాలా రోజులు అవుతుంది. అతను మాకు బిగ్ ఛాలెంజ్ అవుతాడు. మహ్మద్ షమీ క్లాస్ బౌలర్. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అయితే మా టీమ్‌లో చాలా మందికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్..
 

click me!