India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్... తొలిసారి తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత జట్టు! మొదటి ఐదు మ్యాచుల్లో ఛేజ్ చేసి గెలిచిన టీమిండియా..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలబడుతోంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు, 2023 వరల్డ్ కప్‌లో తొలిసారి తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటిదాకా జరిగిన మొదటి ఐదు మ్యాచుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసి విజయాలు అందుకుంది భారత్. కాబట్టి నేటి మ్యాచ్ టీమిండియా బౌలింగ్‌కి పరీక్షగా మారనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2023 వన్డే వరల్డ్ కప్‌ని మొదలెట్టిన ఇంగ్లాండ్, మొదటి ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా ఇంగ్లాండ్ సెమీస్ చేరే ఛాన్స్ చాలా తక్కువ. అయితే పరువు కాపాడుకోవడం ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్, మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి ఘనంగా టోర్నీని ముగించాలని చూస్తోంది..
undefined
మొదటి ఐదు మ్యాచుల్లో గెలిచి అజేయంగా నిలిచిన టీమిండియా, ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంటుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా వేరే జట్లతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది భారత్..
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా నేటి మ్యాచ్‌లో కూడా బరిలో దిగడం లేదు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లే, అదిల్ రషీద్, మార్క్ వుడ్