శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆఫ్ఘానిస్తాన్.. గత నాలుగు మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న ఆఫ్ఘాన్..
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘాన్ జోరు కొనసాగుతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ స్టేజీలో అన్ని మ్యాచులు ఓడిపోయిన ఆఫ్ఘాన్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడో విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌పై 69 పరుగుల తేడాతో నెగ్గి సంచలనం సృష్టించిన ఆఫ్ఘాన్, గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం అందుకుంది. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆఫ్ఘానిస్తాన్..
242 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘాన్‌కి శుభారంభం దక్కలేదు. రెహ్మనుల్లా గుర్భాజ్ డకౌట్ అయ్యాడు. ఇబ్రహీం జాద్రాన్, రెహ్మత్ షా కలిసి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 57 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన ఇబ్రహీం జాద్రాన్, దిల్షాన్ మధుశనక బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
undefined
ఆ తర్వాత రెహ్మత్ షా, ఆఫ్ఘాన్ కెప్టెన్ రెహ్మతుల్లా షాహిదీ కలిసి మూడో వికెట్‌కి 58 పరుగులు జోడించారు. 74 బంతుల్లో 7 ఫోర్లతో 62 పరుగులు చేసిన రెహ్మత్ షా, రజిత బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ- అజ్మతుల్లా ఓమర్‌జాయ్ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 111 పరుగులు జోడించి, ఆఫ్ఘాన్‌కి ఘన విజయం అందించారు..
హస్మతుల్లా షాహిదీ 74 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేయగా అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 49.3 ఓవర్లలో 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దిముత్ కరుణరత్నే 15, పథుమ్ నిశ్శంక 46, కుసాల్ మెండిస్ 39, సధీర సమరవిక్రమ 36, ధనంజయ డి సిల్వ 16, చరిత్ అసలంక 22 , మహీశ్ తీక్షణ 29, ఏంజెలో మాథ్యూస్ 23 పరుగులు చేశఆరు.
ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ముజీబ్ వుర్ రెహ్మాన్ 2 వికెట్లు, అజ్మతుల్లా ఓమర్‌జాయ్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.