
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కరేబియన్ మహిళల టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి టోర్నీలో ముందడుగు వేయాలని భావిస్తున్నది. దకాగా తమ తొలి మ్యాచ్ లో వెస్టిండీస్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడింది.
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విండీస్ సారథి హీలి మాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు రానుంది. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఆ జట్టు ఇక ప్రపంచకప్ మీద ఆశలు వదులుకోవాల్సిందే.
గత మ్యాచ్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్ లో ఆడనుంది. పేసర్ దేవిక వైధ్య కూడా తిరిగి టీమ్ లోకి రానుంది.
తుది జట్లు :
ఇండియా : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్
వెస్టిండీస్ : హీలి మాథ్యూస్ (కెప్టెన్), స్టెఫానీ టేలర్, షామైన్ క్యాంప్‌బెల్, షబికా గజ్నబి, హెన్రీ, చెడీన్ నేషన్, ఫ్లెచర్, షమిలియా కొనెల్, రషద విలియమ్స్, కరిష్మ రమ్హరాక్, షకీరా సెల్మన్