ICC Women's World Cup: ఇంగ్లాండ్ కు మళ్లీ ఆశాభంగం.. మూడో ఓటమి.. దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ

Published : Mar 14, 2022, 02:51 PM ISTUpdated : Mar 14, 2022, 02:54 PM IST
ICC Women's World Cup: ఇంగ్లాండ్ కు మళ్లీ ఆశాభంగం..  మూడో ఓటమి.. దక్షిణాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ

సారాంశం

ICC Women's World Cup 2022: మహిళల ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు మరో ఎదురరుదెబ్బ. దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టుకు ఘోర పరాభవం.  ఈ ఓటమితో  ఆ జట్టు క్వార్టర్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం. 

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న  మహిళల ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు  మరోసారి ఆశాభంగమైంది. ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకుని టోర్నీలో క్వార్టర్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టు.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన  గ్రూప్  మ్యాచులో కూడా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఆ జట్టు ఇంతకుముందు ఆస్ట్రేలియాతో పాటు  వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులలో కూడా ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 3 వికెట్ల తేడాతో ఓడింది. 

టాస్ గెలిచిన సౌతాఫ్రికా మహిళల జట్టు సారథి సునె లుస్ ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.  అయితే ఇంగ్లాండ్ కు ఆశించిన  ఆరంభమేమీ దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ వియాట్ (3)  రెండో ఓవర్లోనే నిష్క్రమించింది.  ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నైట్  (9) కూడా ఐదో ఓవర్లో బౌల్డ్ అయింది.  42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 

 

ఈ క్రమంలో వికెట్ కీపర్ జోన్స్ (53) తో కలిసి ఓపెనర్ బ్యూమోంట్ (62) జట్టును ఆదుకుంది.  ఈ ఇద్దరూ కలిసి  నాలుగో వికెట్ కు 107 పరుగులు జోడించారు.  ఇంగ్లాండ్ స్కోరుబోర్డును మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ జంటను మసబట విడదీసింది. ఆమె తన 33వ ఓవర్లో బ్యూమోంట్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది.  కొద్దిసేపటికే జోన్స్ కూడా రనౌట్ అయింది. ఆ తర్వాత డంక్లీ (26), బ్రంట్ (17) లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ను 50 ఓవర్లలో 235 పరుగులకు కట్టడి చేశారు. 

236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లె లీ (9) వికెట్ కోల్పోయింది. కానీ తర్వాత వచ్చిన లారా (77), తజ్మిన్ (23), కెప్టెన్ సునె లుస్ (36)లు బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడారు. 158 పరుగులకు 4 కీలక వికెట్లు పడ్డా..  మరిజన్నె కాప్ (32), ట్రైయాన్ (15) లు కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.  బ్యాటింగ్ తో పాటుు బౌలింగ్ లో కూడా రాణించిన కాప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా కు ఇంగ్లాండ్ పై ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో దక్షిణాఫ్రికా.. పాయింట్ల పట్టికలో  రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో  ఆసీస్ ఉంది.  ఇక ఇంగ్లాండ్ మాత్రం కింది నుంచి రెండో స్థానానికి పడిపోయింది.  నాలుగు మ్యాచులు ఆడి నాలుగు ఓడిన పాక్.. ఆఖరు స్థానంలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !