లీగ్ దశ ముగిసింది.. అసలు సమరం ముందుంది.. ఆ రెండు జట్లేవో..! విండీస్‌కు ఛాన్స్ ఉందా..?

Published : Jun 28, 2023, 02:51 PM IST
లీగ్ దశ ముగిసింది.. అసలు సమరం ముందుంది..  ఆ రెండు జట్లేవో..! విండీస్‌కు ఛాన్స్ ఉందా..?

సారాంశం

ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే  వరల్డ్ కప్ లో భాగంగా  జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్ పోటీలలో  లీగ్ దశ ముగిసింది. రేపటి నుంచి  సూపర్ సిక్సెస్  ప్రారంభం కానుంది. 

అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ముందు జింబాబ్వే వేదికగా  జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీలలో లీగ్ దశ ముగిసింది.   నిన్న  గ్రూప్ - బీలో   శ్రీలంక - స్కాట్లాండ్, ఐర్లాండ్ - యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్  తో లీగ్ దశకు  తెరపడింది. రేపటి (జూన్ 29) నుంచి  సూపర్ సిక్సెస్ మొదలుకానుంది.   అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనాలంటే  ఈ సూపర్ సిక్సెస్ లీగ్ అన్ని టీమ్ లకు కీలకం కానుంది. 

సూపర్ సిక్సెస్ దశకు అర్హత సాధించిన జట్లలో  శ్రీలంక,  జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఓమన్ (పాయింట్ల పట్టిక ప్రకారం ఇదే వరుసక్రమం) ఉన్నాయి. యూఏఈ, యూఎస్ఎ, నేపాల్, ఐర్లాండ్ ఎలిమినేట్ అయ్యాయి.

సూపర్ సిక్సెస్ లో ఇలా.. 

లీగ్ దశలో గ్రూపులుగా విడిపోయి ఆడిన జట్లు ఇప్పుడు కలిసే ఆడతాయి.  ఒక్కో జట్టు  మూడేసి మ్యాచ్ లు ఆడనుంది. అంటే ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం టాప్ - 1 లో ఉన్న శ్రీలంక.. నెదర్లాండ్స్, జింబాబ్వే,  వెస్టిండీస్ తో ఆడాల్సి ఉంది.  మిగిలిన జట్లు కూడా లీగ్ దశలో తమ గ్రూపులో ఆడిన జట్లతో కాకుండా మిగిలిన టీమ్స్ తో ఆడనున్నాయి.  సూపర్ సిక్సెస్ స్టేజీ ముగిసేటప్పటికీ   పాయింట్ల పట్టికలో టాప్ - 2 లో ఉన్న రెండు జట్లు వన్డే అక్టోబర్ లో భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో మిగిలిన 8 జట్లతో కలుస్తాయి.   ప్రస్తుతానికైతే టాప్ - 2లో శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. మరి ఇవి చివరి వరకు వాటి ఆధిక్యాన్ని కొనసాగిస్తాయా..? అన్నది  కొద్దిరోజుల్లోనే తేలనుంది. 

 

వెస్టిండీస్‌కు చివరి అవకాశం.. 

లీగ్ దశలో నెదర్లాండ్స్ చేతిలో చావుదెబ్బ తిన్న   వెస్టిండీస్..  సూపర్ సిక్సెస్ దశలో పాయింట్ల పట్టికలో  ఐదో స్థానంలో   ఉంది.  ప్రస్తుత దశలో విండీస్ కు వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశాలైతే దాదాపుగా  మూసుకుపోయినట్టే. కానీ ఆ జట్టు సూపర్ సిక్సెస్ లో ఆడబోయే మూడు మ్యాచ్ లను గెలిచి.. జింబాబ్వే, శ్రీలంకలు తాము ఆడబోయే  మూడింటిలో రెండు మ్యాచ్ లు ఓడితేనే  విండీస్ కు టాప్ - 2 కు చేరే అవకాశం ఉంటుంది. లీగ్  దశలో పాయింట్లు సూపర్ సిక్సెస్ లో కలవడంతో శ్రీలంక, జింబాబ్వే లు ఇప్పటికే 4 పాయింట్లతో ఉన్నాయి. మరో మ్యాచ్ గెలిస్తే ఆ జట్లకు 6 పాయింట్లు అవుతాయి. అప్పుడు విండీస్ మూడు గెలిచినా కష్టమే. విండీస్ నెట్ రన్ రేట్ (-0.350) కూడా మైనస్ లలో ఉంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !