వరల్డ్ కప్‌లో టీమిండియాకి అనుకూలంగా పిచ్ తయారుచేస్తున్నారా?.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ...

By Chinthakindhi Ramu  |  First Published Nov 15, 2023, 3:39 PM IST

భారత టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ కలిసి వాళ్లకి నచ్చినట్టుగా, భారత జట్టు ఆటతీరుకి తగ్గట్టుగా పిచ్ రూపొందిస్తున్నారు... ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ వ్యాఖ్యలతో ఈమెయిల్ వైరల్...


2011 వన్డే వరల్డ్ కప్ నుంచి ఏ దేశంలో వరల్డ్ కప్ జరిగితే, ఆ దేశం టైటిల్ గెలుస్తూ వస్తోంది. 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్... స్వదేశంలో వరల్డ్ కప్ టోర్నీలు ఆడి టైటిల్స్ గెలిచాయి. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు లీగ్ స్టేజీలో అన్ని మ్యాచులను వన్ సైడెడ్‌గా గెలిచింది.

సెమీస్‌కి చేరిన సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై విజయాలు అందుకున్న ఏకైక జట్టు టీమిండియా. అయితే భారత జట్టుకి అనుకూలంగా పిచ్ రూపొందిస్తున్నారని ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ వ్యాఖ్యలు చేసినట్టు ఓ ఈమెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Latest Videos

‘భారత టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ కలిసి వాళ్లకి నచ్చినట్టుగా, భారత జట్టు ఆటతీరుకి తగ్గట్టుగా పిచ్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే వాడిన పిచ్‌పై ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ జరగబోతుండడం ఇదే తొలిసారి కావచ్చు..’ అంటూ ఆండీ అట్కిన్సన్ ఆరోపించినట్టు ఆ మెయిల్‌లో ఉంది..

ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ఆలెడ్రీ వాడిన పిచ్‌నే వాడుతున్నారు. దీంతో భారత జట్టు, నిబంధనలకు విరుద్దంగా సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటోందా? అనే అనుమానాలు రేగాయి.

దీనికి ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ‘ఫ్రెష్ పిచ్‌పైనే ఐసీసీ నాకౌట్ మ్యాచులు నిర్వహించాలనే రూల్ ఎక్కడా లేదు. పిచ్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించారా? అవుట్ ఫీల్డ్ సరిగ్గా ఉందా? అనేది మాత్రమే ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుంది.

ఆతిథ్య జట్టు, మ్యాచ్ సజావుగా నిర్వహించేందుకు బెస్ట్ పిచ్‌ని రూపొందించేలా, అవుట్ ఫీల్డ్ సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఒకసారి తయారుచేసిన పిచ్‌ని రెండు మూడు సార్లు వాడొచ్చు. పిచ్ క్యూరటర్ మార్చాలని చెబితేనే మార్చాల్సి ఉంటుంది.

ఐసీసీ ఇండిపెండెంట్ పిచ్ కన్సల్టెంట్ పిచ్‌ తయారీపైన పూర్తి సంతృప్తిగా ఉన్నాడు. పిచ్ బాగోలేదనే ఆరోపణలు కానీ, ఒకే జట్టుకి అనుకూలంగా పిచ్ రూపొందిస్తున్నారనే ఆరోపణలు కానీ నిజం కాదు..’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది ఐసీసీ..

click me!