MS Dhoni: ప్రతీదీ నామీద ఆధారపడితే ఎలా..? జడేజా కెప్టెన్సీ వదులుకోవడంపై ధోని షాకింగ్ కామెంట్స్

By Srinivas MFirst Published May 2, 2022, 2:03 PM IST
Highlights

TATA IPL 2022: రెండ్రోజుల క్రితం అనూహ్యంగా సారథ్య బాధ్యతలు వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజాపై  ఎంఎస్ ధోని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్ కు సహకరించడానికి తాను తొలి రెండు మ్యాచులకు సూచనలిచ్చానని.. కానీ..!!

ఐపీఎల్-2022 సీజన్ కు కొద్దిరోజుల ముందు  చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన రవీంద్ర జడేజా.. రెండ్రోజుల క్రితం తన బాధ్యతల నుంచి  తప్పుకున్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి తనవల్ల కాదని, దాని వల్ల తాను తన ఆటను కూడా కోల్పోతున్నానని  నాయకత్వ పగ్గాలను తిరిగి ధోనికే అప్పగించాడు. అయితే  జడేజా  నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై యాజమాన్యం ఒత్తిడే అనే వార్తలు వస్తున్న వేళ.. సీఎస్కే కెప్టెన్ ధోని ఈ విషయమ్మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ... ‘చెన్నైకి కెప్టెన్ గా ఉండాల్సి వస్తుందనే విషయం జడేజాకు గతేడాదే తెలుసు. అందుకు  అతడికి తగిన  సమయం కూడా ఇచ్చాం. అయితే జట్టును నడిపించే క్రమంలో జడ్డూలో పరివర్తన రావాలని నేను కోరుకున్నాను..  

Latest Videos

 జడేజా  కెప్టెన్ అయ్యాక రెండు మ్యాచులకు అతడికి నేను కొన్ని సలహాలు కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఏ యాంగిల్ లో బౌలింగ్ చేయాలి..? ఫీల్డింగ్ ఎలా సెట్ చేసుకోవాలి..?  వ్యూహుల అమలు ఏంటన్నది అతడికే వదిలేసాను. ఎందుకంటే  అన్ని  కలిపి చెంచాతో తినపించడానికి కెప్టెన్సీ అనేది  చిన్న విషయం కాదు. అలా చేసినా కెప్టెన్ గా రాణించలేరు. నాయకుడిగా ఉన్నప్పుడు ఫీల్డ్ లో మీరే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలకు మీరే బాధ్యత వహించాలి.. 

మీరు కెప్టెన్ గా మారిన తర్వాత  చాలా డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది. నా అభిప్రాయం మేరకు ఆ టాస్క్ లే  జడేజాను ఒత్తిడికి గురి చేసి ఉంటాయి. అదే అతడి బ్యాటింగ్, బౌలింగ్ మీద ప్రభావం చూపాయని నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు  కెప్టెన్సీ భారం లేకపోవడంతో తిరిగి అతడు  మళ్లీ ఆల్ రౌండర్ గా రాణిస్తాడని నేను నమ్ముతున్నాను. అతడు  తిరిగి మునపటి  ఆటను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం..’ అని చెప్పాడు. 

 

Thalaivan Irukkindraan! 🦁 💛 pic.twitter.com/WKgFGm1OC1

— Chennai Super Kings (@ChennaiIPL)

ఇక ధోని తిరగి సారథిగా రావడం, జడ్డూ కెప్టెన్సీ వదిలేయడం భారత మాజీ క్రికెటర్  వసీం జాఫర్ కూడా స్పందించాడు.  జాఫర్ మాట్లాడుతూ.. ‘జడేజా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నానని  భావిస్తున్నాడు. అది నేను అర్థం చేసుకోగలను. చెన్నైకి కెప్టెన్ గా కాకముందు అతడికి సారథిగా చేసిన అనుభవం లేదు.  కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా అతడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అదీగాక పరిస్థితులను బట్టి ఏ బౌలర్ తో బాల్ వేయించాలి..? ఫిల్డింగ్ ఎలా సెట్ చేయాలనేదానిమీద కూడా జడ్డూకు  అవగాహన కరువవుతున్నది. జడేజా కంట్రోల్ లో ఏదీ ఉండటం లేదు. కానీ ఎంఎస్ ధోని కెప్టెన్ అవడం వల్ల చెన్నైకి కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి’ అని తెలిపాడు. 

click me!