తూచ్ అప్పుడు మిషన్ పనిచేయలేదు.. ఫాస్టెస్ట్ బాల్ వేసింది అక్తర్ కాదు.. నేనే.. పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

Published : May 01, 2022, 04:46 PM IST
తూచ్ అప్పుడు మిషన్ పనిచేయలేదు.. ఫాస్టెస్ట్ బాల్ వేసింది అక్తర్ కాదు.. నేనే.. పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Mohammad Sami: ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసేది ఎవరంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్. బుల్లెట్ కంటే వేగంతో  దూసుకువచ్చే అతడి కంటే తానే వేగంగా బంతులు విసిరానని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ  పేసర్.   

ప్రస్తుతం మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్  లో ఫాస్టెస్ట్ డెలివరీలతో అదరగొడుతున్నాడు కాశ్మీరి కుర్రాడు ఉమ్రాన్ మాలిక్.  ప్రతి మ్యాచ్ లో  కనీపం 150 కిలోమీటర్లకు తగ్గకుండా.. 150-153 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరుతూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. అతడు షోయభ్ అక్తర్ వేగాన్ని  కూడా దాటేస్తాడని అందరూ అంటున్న తరుణంలో పాకిస్తాన్ మాజీ పేసర్  మహ్మద్ సమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ప్రపంచంలో అత్యధిక వేగవంతమైన  బౌలింగ్ తనదేనని అయితే అప్పుడు మిషన్ (స్పీడ్ గన్) పని చేయలేదని చెప్పుకొచ్చాడు. అక్తర్ కంటే  తానే ఎక్కువ వేగంతో బంతులు విసిరానని సమీ అన్నాడు. 

పాకిస్తాన్ లోని పాకిస్తాన్ టీవీ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీ మాట్లాడుతూ.. ‘నేను 160 కిలోమీటర్ల వేగంతో  బౌలింగ్ చేశాను.  ఒక మ్యాచ్ (అది ఏ మ్యాచ్ అనేది సమీ పేర్కొనలేదు) లో నేను 162, `64 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాను... 

కానీ అప్పుడు  బౌలింగ్ మిషన్ పని చేయలేదు.  పని చేసి ఉంటే అక్తర్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయేవి. స్పీడ్ గన్ లు పని చేయకపోవడం వల్ల నేను విసిరిన ఫాస్టెస్ట్ బాల్స్ రికార్డ్ కాలేకపోయాయి. మీరు ఒక విషయం చూస్తే.. 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరినవాళ్లు  వాళ్ల కెరీర్ మొత్తం అదే నిలకడ కొనసాగించలేదు. ఏదో మ్యాచ్ కు ఒకటి, రెండు బంతులు మాత్రమే  ఆ వేగంతో పడేవి. మిగతావన్నీ 150, అంతకుతక్కువే ఉండేవి...’ అని చెప్పుకొచ్చాడు. 

కాగా ప్రపంచ  క్రికెట్ లో అత్యధిక వేగవంతమైన డెలివరీ విసిరింది  షోయభ్ అక్తర్. 2002లో అక్తర్.. న్యూజిలాండ్ తో జరిగిన  మ్యాచ్ లో ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసిరాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. ఆ తర్వాత షాన్ టైట్ (న్యూజిలాండ్), బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) లు 160 కి.మీ. వేగంతో బాల్స్ వేశారు. అయితే  తాను 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరానన్నది ఎక్కడా రికార్డై లేదు. కాగా సమీ భారత్ తో జరిగిన ఓ మ్యాచ్ లో కడూా 162 కి.మీ. వేగంతో  బౌలింగ్ చేశాడని  ట్విట్టర్ లో ఓ వీడియో వైరల్ గా మారింది. 

 

తన కెరీర్ లో పాకిస్తాన్ తరఫున 36 టెస్టులు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడిన ఈ వెటరన్ క్రికెటర్.. 2003లో జింబాబ్వే తరఫున ఆడుతున్నప్పుడు ఓ మ్యాచ్ లో  156.4 స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. అదే అతడి అత్యుత్తమ బౌలింగ్ స్పీడ్ గా రికార్డై ఉంది. 

ఇక ఐపీఎల్ విషయానికొస్తే..  తాను ఆడుతున్న ప్రతి మ్యాచ్  లో 150 కి.మీ కు మించి బౌలింగ్ చేస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్.  ఇప్పటివరకు ఐపీఎల్-15లో లాకీ ఫెర్గూసన్ 153.7 కి.మీ వేగంతో అత్యధిక వేగవంతమైన డెలివరీ విసరగా ఆ తర్వాత  ఉమ్రాన్ మాలిక్ 153.3 తో రెండో స్థానంలో ఉన్నాడు.  లాకీ ఫెర్గూసన్ ఆ తర్వాత ఆ నిలకడను కొనసాగించలేకపోయినా.. మాలిక్ మాత్రం ప్రతి మ్యాచ్ లో 150 కి.మీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఎన్నటికైనా 155 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయడం తన లక్ష్యమని ఉమ్రాన్ చెబుతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన