కోహ్లీ సెంచరీ కొడితే గానీ పెళ్లి చేసుకోనన్నాడు.. ఇప్పుడేమో పరుగుల వరదకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు..

By Srinivas MFirst Published Jan 17, 2023, 2:43 PM IST
Highlights

Virat Kohli: ఇప్పుడంటే కోహ్లీ  బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తూ మళ్లీ శతకాల బాట పట్టాడు గానీ గతేడాది ఆగస్టుకు ముందు పరిస్థితి ఇలా లేదు.  అంతర్జాతీయ  స్థాయిలో 70  సెంచరీలు చేసిన కోహ్లీ.. 71వ సెంచరీకి మూడేండ్లు ఆగాల్సి వచ్చింది.

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ గురించి  ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..?  భారత్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి  అభిమానాన్ని, ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు కోహ్లీ.   దశాబ్దకాలంగా భారత బ్యాటింగ్ కు వెన్నెముకలా నిలిచాడు.  మంచినీళ్లు తాగినంత ఈజీగా  సెంచరీలు  చేశాడు.  రికార్డుల దుమ్ము దులిపాడు.   ప్రస్తుతం ఇదే ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ సాధించిన క్రికెట్ రికార్డులను  బ్రేక్  చేయడం అసాధ్యమైతే కాదు.  

అయితే ఇప్పుడంటే కోహ్లీ  బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తూ మళ్లీ శతకాల బాట పట్టాడు గానీ గతేడాది ఆగస్టుకు ముందు పరిస్థితి ఇలా లేదు.  అంతర్జాతీయ  స్థాయిలో 70  సెంచరీలు చేసిన కోహ్లీ.. 71వ సెంచరీకి మూడేండ్లు ఆగాల్సి వచ్చింది. 

మరీ ముఖ్యంగా  2019 నుంచి  2021 ఆగస్టు వరకు  కోహ్లీ  తన కెరీర్ లోనే  అత్యంత హీనదశను చూశాడు.   ఈ మూడేండ్లలో సెంచరీ సంగతి దేవుడెరుగు.. కనీసం 30-40 పరగులు చేసినా చాలు.. అనుకునేంత స్థాయికి దిగజారింది  అతడి ప్రదర్శన.  అప్పుడు అతడు మళ్లీ సెంచరీల బాట పట్టాలని దేవుడికి మొక్కని టీమిండియా ఫ్యాన్ లేడంటే అతిశయెక్తి కాదు. కొందరైతే కోహ్లీ సెంచరీ కోసం పెళ్లిల్లు కూడా మానేసుకున్నారు.   కొందరు తమ గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ కు వెళ్లనన్నారు. పలువురు గడ్డం తీసుకోలేదు.  ఈ క్రమంలో  ఓ  యువకుడు కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఆడుతుండగా.. ‘కోహ్లీ  71వ సెంచరీ చేస్తే గానీ నేను పెళ్లి చేసుకోను..’     అని మంగమ్మ శపథం చేశాడు. ఆ సమయంలో పలువురు ఆకతాయిలు.. ‘ఇక నువ్వు పెళ్లి గురించి మరిచిపో..’అని కామెంట్స్ చేశారు. 

ఇదిలాఉండగా గతేడాది ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక  కోహ్లీ కొద్దిరోజుల పాటు విరామం తీసుకున్నాడు. తిరిగి ఆసియా కప్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు.  టోర్నీలో  సూపర్ సక్సెస్ కోహ్లీనే. అఫ్గానిస్తాన్ పై సెంచరీ కూడా చేశాడు.  ఇక డిసెంబర్ లో  బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో  తాజాగా లంకపై వరుసగా రెండు సెంచరీలు.. మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. 

 

"I asked for the 71st century but he scored 74th on my special day" ❤️❤️❤️ pic.twitter.com/zHopZmzKdH

— Aman Agarwal (@Aman2010Aman)

కోహ్లీ 71వ సెంచరీ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన సదరు అభిమాని.. తన  మ్యారేజ్ కు  ఏర్పాట్లు చేసుకున్నాడు.  71వ సెంచరీ తర్వాత పెళ్లి కుదిరినా ముహుర్తాలు లేకపోవడంతో జనవరి దాకా ఆగాడు. రెండ్రోజుల క్రితం అతడి పెండ్లి జరిగింది.  ఆదివారం రోజున పెళ్లి చేసుకున్న అతడికి కోహ్లీ అదిరిపోయే మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చాడు.  లంకతో మూడోవన్డేలో  కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో సదరు అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అతడు తన సోషల్ మీడియా ఖాతాలో   పోస్ట్ చేశాడు. 

 

click me!