కోహ్లీ హోటల్ గదిలోకి చొరబడి రచ్చ రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో

By Srinivas M  |  First Published Oct 31, 2022, 11:34 AM IST

Virat Kohli: టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో  టీ20 ప్రపంచకప్ ఆడుతున్న తరుణంలో అతడికి ఊహించని షాక్ తగిలింది. కోహ్లీ పెర్త్ లో ఉంటున్న హోటల్ గదిలోకి చొరబడి మరి..


మైదానంలో తన భావోద్వేగాలను అణుచుకోవడంలో  అస్సలు మొహమాటం లేకుండా ఉండే  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడడు.   తన ఆట, క్రికెట్ కు సంబంధించిన  విషయాలను ఇబ్బంది లేకుండా చెప్పే  అతడు.. తన ప్రైవేట్ లైఫ్ గురించి అస్సలు బయటపెట్టడు.  అందుకే కూతురు పుట్టి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు అధికారికంగా ఆ చిన్నారిని ప్రపంచానికి పరిచయం లేదు.  ‘ఆమె గోప్యతను గౌరవించండి..’అంటూ విరుష్క లు  ప్రతీసారి మీడియా వాళ్లకు చెబుతుంటారు.  వ్యక్తిగత విషయాలపై అంత పట్టింపుగా ఉండే కోహ్లీకి  ఆస్ట్రేలియాలో ఊహించని షాక్ తగలింది. 

పెర్త్ లో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ  వెళ్లగా..  అతడు ఉంటున్న హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకైంది. ‘ఇదిగో.. ఇదే కింగ్ కోహ్లీ హోటల్ రూమ్..’ అని వీడియో మీద రాసి ఉంది. 

Latest Videos

ఈ వీడియోలో కోహ్లీ వాడే గ్లాసులు, క్యాప్,  ఫోన్, వేసుకునే షూస్, టీమిండియా జెర్సీతో పాటు తన బట్టలు, కోహ్లీ వాడే న్యూట్రీషన్  పౌడర్ బాక్స్ లు, అతడు పడుకునే బెడ్, తదితర వస్తువులన్నీ వీడియో లో రికార్డు చేసిన దుండగులు.. దానిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు. కోహ్లీ పేరు ఉంటేనే  పోస్టులు,  ఫోటోలు వైరల్ అవుతాయి.. అలాంటిది ఇంత రచ్చ  జరిగినాక సదరు వీడియో  నెట్టింట షికార్లు కొట్టకుండా ఉంటదా..?  ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో ఈ వీడియో చక్కర్లు కొట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

undefined

A post shared by Virat Kohli (@virat.kohli)

ఈ నేపథ్యంలో కోహ్లీ  స్పందించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘అభిమానులు తమ అభిమాన ఆటగాడిని గురించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకునేందుకు, వారికి కలిసేందుకు  చాలా  ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో నేను వారిని అభినందిస్తాను కూడా. కానీ ఇక్కడ కనబడుతున్న వీడియో  భయంకరగంగా ఉంది. ఇది నా గోప్యత (ప్రైవసీ) కు సంబంధించిన విషయం. నేను   ఉండే హోటల్ రూమ్ లో కూడా గోప్యతను కలిగిలేకపోతే ఇంకెక్కడ  పొందుతాను..? ఈ రకమైన అభిమానాన్ని  నేను ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. దయచేసి వ్యక్తుల  ప్రైవసీని గౌరవించండి. వారిని ఒక వినోద వస్తువుగా పరిగణించవద్దు..’అని రాసుకొచ్చాడు. 

ఈ వీడియో పై   ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.  ‘ఇది చాలా దారుణం. అస్సలు సమ్మతించేది కాదు...’ అని కామెంట్ చేశాడు.  బాలీవుడ్ నటి పరిణితి చోప్రా.. ‘ఓ మై గాడ్.. ఇది దిగజారుడుతనానికి పరాకాష్ట..’ అని కామెంట్ చేసింది. 

click me!