టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ ఆటకు దూరం?!..

Published : Oct 31, 2022, 10:38 AM ISTUpdated : Oct 31, 2022, 10:47 AM IST
టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ ఆటకు దూరం?!..

సారాంశం

స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ ఆటకు దూరం కానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి వర్గాలు. వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా బుధవారం బంగ్లాదేశ్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కీలక దశలో భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ గాయానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 15 ఓవర్లు ముగిసిన తర్వాత కార్తీక్ వెన్నునొప్పితో బాధపడుతూ మైదానం వీడాడు.  అతని స్థానంలో రిషబ్ పంత్  కీపింగ్ కొనసాగించాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా బుధవారం బంగ్లాదేశ్ మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

కార్తీక్  వెన్నునొప్పితో బాధపడుతున్న విషయాన్ని మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో భువనేశ్వర్ కుమార్ నిర్ధారించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అతను చెప్పాడు. ప్రపంచ కప్లో 1,6 పరుగులు చేసి  కార్తీక్ తో నెదర్లాండ్స్ తో మ్యాచ్లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఒక వేళ కార్తిక్ దూరమైనా.. పంత్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండటంతో ఇప్పటికిప్పుడు భారత జట్టు ఎలాంటి బెంగా లేకపోవచ్చు. కాగా ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

దినేశ్ కార్తీక్‌లో కనిపించని ఫైర్... రిషబ్ పంత్‌కి రూట్ క్లియర్ చేసేసినట్టేనా...

కాగా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ గా మారాడు దినేష్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో టీమిండియాలోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్ తో పాటు ఆ తరువాత జరిగిన మ్యాచుల్లోనూ ఆఖరులో వచ్చి మెరుపులు మెరిపించి సెలక్టర్లను మెప్పించాడు. ఆసియాకప్ 2022 టోర్నీలో ఆడిన దినేష్ కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ కి సెలక్ట్ చేశారు. 

అయితే, యంగ్ వికెట్ కీపర్లైన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ లాంటి వారిని పక్కనబెట్టి.. సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో చోటు కల్పించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. గౌతమ్ గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లయితే ఈ వయసులో దినేశ్ కార్తీక్‌ని వరల్డ్ కప్ ఆడించడం వేస్ట్ అన్నారు కూడా. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?