‘వార్నర్ అన్నా... ఏందన్నా ఇది, నువ్వెందుకు వచ్చావ్...’ సన్‌రైజర్స్ ఓటమిపై ఈషా రెబ్బ ట్వీట్...

Published : Apr 26, 2021, 12:15 AM IST
‘వార్నర్ అన్నా... ఏందన్నా ఇది, నువ్వెందుకు వచ్చావ్...’ సన్‌రైజర్స్ ఓటమిపై ఈషా రెబ్బ ట్వీట్...

సారాంశం

అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన డేవిడ్ వార్నర్... మంచి ఫామ్‌లో ఉన్న బెయిర్ స్టో లేదా సుచిత్‌ను పంపించి ఉండాల్సిందంటూ వార్నర్‌ను విమర్శించిన హీరోయిన్ ఈషా రెబ్బ...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది.  ఆరంభంతో బెయిర్ స్టో దూకుడు, కేన్ విలియంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్, జగదీశ సుచిత్ మెరుపుల కారణంగా మ్యాచ్‌ను టైగా ముగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

అయితే సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌కి రావడంపై విమర్శలు వస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడే డేవిడ్ వార్నర్‌కి బదులుగా మంచి ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోని లేదా ఆఖర్లో ఈజీగా బౌండరీలు బాదిన సుచిత్‌ను పంపించి ఉంటే, ఆరెంజ్ ఆర్మీ మరిన్ని పరుగులు చేసి ఉండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

సరిగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.‘వార్నర్ అన్న... ఏందిది? ఎందుకు నువ్వు వచ్చావు? బెయిర్ స్టోని లేదా సుచిత్‌ను పంపొచ్చుగా... నీకు టీమ్ నిర్మించుకోవాలని అనుకోవాలనుకుంటే డ్రీమ్ లెవెన్‌లో నిర్మించుకో’ అంటూ ట్వీట్ చేసింది ఈషా రెబ్బ.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు