క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట విషాదం... కరోనాతో మహిళా క్రికెటర్ తల్లి మృతి...

Published : Apr 25, 2021, 09:44 PM ISTUpdated : Apr 25, 2021, 09:46 PM IST
క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట విషాదం... కరోనాతో మహిళా క్రికెటర్ తల్లి మృతి...

సారాంశం

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన భారత క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చేలువాంబ దేవి... కరోనాతో పోరాడుతున్న క్రికెటర్ సోదరి... సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించిన క్రికెటర్... 

భారత మహిళా జట్టు ప్లేయర్, ఆల్‌రౌండర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడిన, వేదా కృష్ణమూర్తి తల్లి చేలువాంబ దేవి మరణించారు. శనివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది వేదా కృష్ణమూర్తి.

‘మా అమ్మ మరణం గురించి నాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి.  అమ్మను కోల్పోయిన మా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, మీరు ఊహించగలరని భావిస్తున్నా. ఇప్పుడు నా సోదరి గురించి ప్రార్థించండి. నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తాడని కోరకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేసింది వేదా కృష్ణమూర్తి. 

 

కర్ణాటకకు చెందిన వేదా కృష్ణమూర్తి, 48 వన్డేలు, 74 టీ20 మ్యాచులు ఆడింది. జట్టులో మహా చలాకీ అయిన వేదా కృష్ణమూర్తికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు