Gautam Gambhir : టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ రేసులో ప్రధానంగా వినిస్తున్న పేరు గౌతమ్ గంభీర్. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత గంభీర్ మౌనాన్ని వీడుతూ.. తకంటే గొప్ప గౌరవం మరొకటి లేదని అన్నాడు.
Team India : టీమిండియా కొత్త ప్రధాన కోచ్ రేసులో భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం రాహుల్ ద్రవిడ్ తర్వాత గంభీర్ టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్‌గా మారబోతున్నాడు. ఈ ఊహాగానాల మధ్య ఈ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించాడు. జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం తనకు చాలా ఇష్టమని గౌతం గంభీర్ తెలిపాడు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ మూడో టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ ఆహ్వానించగా, మే 27 తో ఈ గడువు ముగిసింది. అయితే, గంభీర్ దరఖాస్తు చేసుకున్నరా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అబుదాబిలో జరిగిన ఓ ఈవెంట్‌లో గంభీర్ మాట్లాడుతూ, 'నేను భారత జట్టుకు కోచ్‌గా ఉండాలనుకుంటున్నాను. మీ జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం లేదు. మీరు 140 కోట్ల మంది భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారని" అన్నాడు.
undefined
India vs Ireland: టీ20 వరల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భారత్ రికార్డులు ఇవే
ఈ వారం ప్రారంభంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాన కోచ్ పాత్ర కోసం గంభీర్‌కు మద్దతు తెలిపాడు. అబుదాబిలోని మెడోర్ ఆసుపత్రిలో విద్యార్థులను ఉద్దేశించి గంభీర్ ప్రసంగించారు. భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గురించి, అతని అనుభవంతో ప్రపంచ కప్ గెలవడానికి సహాయం చేయడం గురించి ఎవరైనా అతనిని అడిగినప్పుడు, గంభీర్ సమాధానమిస్తూ.. 'ఈ ప్రశ్నకు నేను ఇంకా సమాధానం చెప్పలేదు. అయితే, చాలా మంది దీని గురించి నన్ను అడిగారు. కానీ ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పాలి. 140 కోట్ల మంది భారతీయులు భారత్‌కు ప్రపంచకప్ గెలవడానికి సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరూ మన కోసం ప్రార్థించడం ప్రారంభించి, మేము వారికి ప్రాతినిధ్యం వహించడం, ఆడటం ప్రారంభిస్తే, అప్పుడు భారతదేశం ప్రపంచ కప్ గెలుస్తుంది. చాలా ముఖ్యమైన విషయం ధైర్యంగా ఉండటం" అని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2024 లో తొలి సూపర్ ఓవర్.. ఒమన్ పై నమీబియా సూపర్ విక్టరీ