వీడు మీకంటే ఎక్కువ బాల్స్ ఆడేశాడు భయ్యా! అజింకా రహానేని ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్..

Published : Jul 15, 2023, 05:40 PM IST
వీడు మీకంటే ఎక్కువ బాల్స్ ఆడేశాడు భయ్యా! అజింకా రహానేని ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్..

సారాంశం

తొలి టెస్టులో 11 బంతులు ఆడి 3 పరుగులు చేసి అవుటైన అజింకా రహానే... మీ కంటే విండీస్ 11వ నెంబర్ ప్లేయర్ ఎక్కువ బంతులు ఆడాడంటూ ట్రోల్ చేసిన ఇషాన్ కిషన్.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న అజింకా రహానే, వెస్టిండీస్ టూర్‌లో తిరిగి టెస్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. తొలి టెస్టులో 11 బంతులు ఆడిన అజింకా రహానే, కీమర్ రోచ్ బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆట మూడో రోజు టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, అజింకా రహానేని తన స్టైల్‌లో ట్రోల్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన వెస్టిండీస్, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 108 పరుగుల వద్ద 9వ వికెట్ పడగా, ఆఖరి వికెట్ తీసేందుకు 4 ఓవర్లు తీసుకున్నారు భారత బౌలర్లు..

అప్పటికే మూడో రోజులో 90 ఓవర్లు అయిపోయినా, వెస్టిండీస్ ఆలౌట్‌కి దగ్గర ఉండడం అరగంట ఆటను అదనంగా ఇచ్చారు అంపైర్లు. ఊహించని విధంగా 11వ స్థానంలో వచ్చిన జొమెల్ వర్రీకాన్ 18 బంతులు ఆడి 3 ఫోర్లతో 18 పరుగులు చేశాడు..

దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అజింకా రహానేతో ‘వీడు మీ కంటే ఎక్కువ బాల్స్ ఆడేశాడు భయ్యా..’ అంటూ అనేశాడు ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ అన్న మాటలకు షాక్ అయిన అజింకా రహానే... ‘ఆ? ఏంటి?’ అంటూ నోరెళ్లబెట్టాడు. ఇషాన్ కిషన్ దీన్ని పొడగించకుండా ముగించాడు...

వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ కూడా 11 బంతులే ఆడి 6 పరుగులు చేశాడు. కొద్దిసేపటి తర్వాత శుబ్‌మన్ గిల్‌ని కూడా ఇదే విధంగా ట్రోల్ చేశాడు ఇషాన్ కిషన్. తొలి టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్, 20 బంతులు ఆడి సింగిల్ తీశాడు. ఇషాన్ కిషన్ సింగిల్ ఎప్పుడు తీస్తాడా? అని ఎదురుచూసిన రోహిత్ శర్మ, అతను 19 బంతుల తర్వాత స్ట్రైయిక్ రొటేట్ చేయడంతో ఫ్రస్టేషన్‌ వ్యక్తం చేస్తూ డిక్లేరేషన్ ప్రకటించాడు..

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్‌కి రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కో వికెట్ దక్కాయి...

తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ 387 బంతులు ాడి 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 171 పరుగులు చేసి అవుట్ కాగా రోహిత్ శర్మ 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 182 బంతుల్లో 5 ఫోర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విండీస్‌ గడ్డ మీద అతి పెద్ద విజయాన్ని అందుకుంది టీమిండియా. 171 పరుగులు చేసిన యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !