ఎప్పటికీ కోహ్లీనే నా కెప్టెన్... రహానే

By telugu news teamFirst Published Jan 27, 2021, 8:32 AM IST
Highlights

రహానే ని శాశ్వతంగా కెప్టెన్ చేస్తే బాగుంటుందని... కోహ్లీని తప్పించాలంటూ చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే... ఆ సిరీస్ సమయంలో కెప్టెన్ గా అజింక్య రహానే వ్యవహరించాడు. పితృత్వపు సెలవల నేపథ్యంలో కోహ్లీ స్వదేశానికి చేరుకోగా.. ఆ సీరిస్ కి రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

రహానే కెప్టెన్ గా ఉన్న సమయంలోనే.. జట్టు విజయం సాధించడంతో అందరి కళ్లు.. రహానే పై పడ్డాయి. రహానే ని శాశ్వతంగా కెప్టెన్ చేస్తే బాగుంటుందని... కోహ్లీని తప్పించాలంటూ చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా.. ఇదే విషయం రహానే ముందు ప్రస్తావించగా.. ఆయన స్పందించిన తీరు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

తన సారథ్యంలో ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెల్చినా, జట్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీయేనని, అందులో ఎలాంటి వివాదానికి తావులేదని స్పష్టం చేశాడు.

కోహ్లీయే నా కెప్టెన్... నేనతడికి డిప్యూటీని... ఇద్దరి మధ్య ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. కోహ్లీ లేనప్పుడు అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకోవడం తన విధి అని వివరించాడు. జట్టు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిపోరాడడం తన కర్తవ్యం అని పేర్కొన్నాడు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు. ఇంగ్లాండ్ తో టీమిండియా ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుండగా, కోహ్లీ నాయకత్వంలో జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఎప్పట్లానే రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

click me!