మీతో గొడవ పడ్డందుకు సిగ్గుగా ఉంది.. సారీ కోహ్లీ సార్.. దారికొచ్చిన నవీన్ ఉల్ హక్..?

Published : May 28, 2023, 03:39 PM IST
మీతో గొడవ పడ్డందుకు సిగ్గుగా ఉంది.. సారీ కోహ్లీ సార్.. దారికొచ్చిన నవీన్ ఉల్ హక్..?

సారాంశం

Virat Kohli - Naveen Ul Haq: ఐపీఎల్ - 16 లో విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగి  ఆ  తర్వాత అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన క్రికెటర్ నవీన్ ఉల్ హక్  దారికొచ్చాడా..?  తన తప్పు తెలుసుకుని  విరాట్‌కు క్షమాపణ చెప్పాడా..? 

ఐపీఎల్-16లో  సెకండాఫ్  ప్రారంభంలో బ్రాడ్‌కాస్టర్ల పంట పండించిన వివాదం ‘కోహ్లీ - నవీన్’ది అని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. తొలిసారి ఐపీఎల్ ఆడుతున్న నవీన్..  లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  మధ్య మే 1న  లక్నో వేదికగా జరిగిన  మ్యాచ్ లో   కోహ్లీ - నవీన్ మధ్య తలెత్తిన వాగ్వాదం.. అదే మ్యాచ్ టో కోహ్లీ.. గంభీర్ తో  వాదులాడుకోవడం..   కోహ్లీ - నవీన్ మధ్య  సర్దిచెప్పాలని  కెఎల్ రాహుల్ యత్నించినా అందుకు ఈ అఫ్గాన్ పేసర్ ససేమిరా అనడం.. ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్.. కోహ్లీ అభిమానులను నవీన్ పదే పదే గెలకడం వంటివి ఐపీఎల్ -16 కు మాస్ మసాలాను అందించాయి.  

అయితే తాజాగా ట్విటర్ వేదికగా  నవీన్ ఉల్ హక్ (?) తన ట్విటర్ ఖాతాలో తాను చేసిన తప్పును తెలుసుకుని  పశ్చత్తాపంతో ‘ఐయామ్ సారీ విరాట్ కోహ్లీ సార్..’ అని  ట్వీట్ చేయడంతో పాటు  ‘నేను  కోహ్లీకి  వీరాభిమానిని.  చిన్నప్పట్నుంచీ ఆయనను  ఆరాధిస్తూ పెరిగా. మా ఇంట్లో నా రూమ్  మొత్తం కోహ్లీ ఫోటోలో ఉంటాయి.  నాకు  ఆర్సీబీలో కోహ్లీ నాయకత్వంలో ఆడాలని ఉంది..’అని ట్వీట్ చేసినట్టు  ట్విటర్‌లో ఓ పోస్టు వైరల్ అయింది. 

 

దీంతో  నవీన్ తప్పు తెలుసుకున్నాడని.. అతడిలో పశ్చాత్తాపం మొదలైందని  కోహ్లీ ఫ్యాన్స్.. ‘ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా.  ఎందుకింత పెంట చేశావ్.. సరె సరేలే ఇప్పటికైనా రియలైజ్ అయ్యావ్..!’ అన్న రేంజ్ బిల్డప్ ఇచ్చి   ఓ కరుడుగట్టిన నేరస్తుడికి ప్రభుత్వం క్షమాభిక్ష  పెట్టిన రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు.  కానీ  ఇక్కడే అసలు ట్విస్ట్. ఇది నవీన్ ఉల్ హక్  చేయలేదు.  ఫేకుడు రాయుళ్ల పని ఇది. ఈ విషయాన్ని స్వయంగా   నవీన్ తన  ఇన్‌స్టా స్టోరీస్ లో దీనిని వెల్లడించాడు.  

 

ఈ వైరల్ పోస్టులను పోస్ట్ చేసిన  ఫేక్ ట్విటర్ ఖాతా స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ..  తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ ను నడుపుతున్నారని.. ఇంత కష్టపడుతున్నవారికి థ్యాంక్స్ అని  అందులో రాసుకొచ్చాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?