హార్థిక్ షూస్ దొంగిలించిన కృనాల్ భార్య.. ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్..

Published : Jun 19, 2023, 06:06 PM ISTUpdated : Jun 19, 2023, 06:08 PM IST
హార్థిక్ షూస్ దొంగిలించిన కృనాల్ భార్య..  ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్..

సారాంశం

Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వదిన, కృనాల్ పాండ్యా భార్య  అతడి  షూస్‌ను దొంగిలించిన వీడియో వైరల్ అవుతోంది.  

టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ   రెండు  సార్లు ఆ జట్టును ఫైనల్ కు చేర్చిన హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది పిబ్రవరిలో తన   భార్య నటాషా స్టాన్కోవిచ్ ను  హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహమాడిన విషయం తెలిసిందే.  అయితే ఈ పెళ్లి సందర్భంగా  హార్ధిక్  అన్న కృనాల్ పాండ్యా  భార్య  పాంకురి శర్మ..  మరిది  షూస్ దొంగిలిచింది.   అంతేగాక లక్ష రూపాయలు ఇస్తేనే వాటిని తిరిగిస్తానని డిమాండ్ చేసింది.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 

అసలు ఏం  జరిగిందంటే... పెళ్లి వేడుకలో భాగంగా   గుజరాత్ సంప్రదాయం ప్రకారం  ‘జూతా చురాయి’ని నిర్వహిస్తారు.  జూతా చురాయి అంటే  పెళ్లికొడుకు వేసుకునే  పాదరక్షలు దాచిపెట్టడం.  ఇది  పెళ్లికొడుకు వదిన, మరదళ్లు చేయాలి. మన తెలుగు సంప్రదాయంలో పెళ్లికూతురు  సోదరులు.. తమకు కాబోయే బావను ఆట పట్టించినట్టు (బావమరిది కట్నం) జూతా చురాయి కూడా ఓ ఆచారం.

అయితే  పాంకురి.. హార్ధిక్ షూస్ దాచిపెట్టి తనకు  అడిగినంత కట్నం ఇస్తేనే అవి ఎక్కడున్నాయో చెప్తానని డిమాండ్ చేసింది. అప్పుడు హార్ధిక్.. ‘సరే, నీకు ఎంత కావాలో చెప్పు వదిన’ అనడంతో పాంకురి.. ‘లక్ష రూపాయలు’ అని  చెప్పింది. వెంటనే హార్ధిక్.. ‘లక్ష రూపాయలు ఏం  సరిపోతాయి. ఐదు లక్షలు తీసుకో వదినా..’ అంటూ  తన  పక్కనున్నవాళ్లతో ఆ డబ్బుల సంగతి చూడాలని  చెప్పాడు. అయితే పాంకురి మాత్రం.. తనకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చూపిస్తేనే  షూస్ ఇస్తానని మరిదిని ఆటపట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

 

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీరంటే డబ్బున్నోళ్లు బ్రో.. లక్ష అడిగితే ఐదు లక్షలిచ్చారు.. అందరు పెళ్లి కొడుకులు ఇలా చేస్తే ఎంత బాగుండో..’అని  ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

ఇక హార్ధిక్ - నటాషాల  పెళ్లి విషయానికొస్తే.. 2020లోనే వీరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే అది కోర్టు మ్యారేజ్. ఎలాంటి హడావిడి లేకుండా తంతు పూర్తి చేసుకున్నారు. కానీ  2022లో మాత్రం  ఫిబ్రవరి 14న పురస్కరించుకుని ఈ జంట  రెండు మతాల సంప్రదాయాల ప్రకారం ఉదయ్‌పూర్ (రాజస్తాన్) లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !