అందరికీ ఈ మసాలా కావాలి! రికీ పాంటింగ్ నుంచే నేను నేర్చుకున్నా... ఓల్లీ రాబిన్‌సన్ కామెంట్...

Published : Jun 19, 2023, 04:45 PM IST
అందరికీ ఈ మసాలా కావాలి! రికీ పాంటింగ్ నుంచే నేను నేర్చుకున్నా... ఓల్లీ రాబిన్‌సన్ కామెంట్...

సారాంశం

141 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా వికెట్ తీసిన ఓల్లీ రాబిన్‌సన్... అవుట్ చేసిన తర్వాత కళ్లు ఉరిమిచూస్తూ అగ్రెసివ్ సెలబ్రేషన్స్.. 

యాషెస్ సిరీస్‌ 2023 మొదటి మ్యాచ్ నుంచి క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్సహం రేపుతోంది. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు అందుకున్నాక, బజ్ బాల్ కాన్సెప్ట్‌ని దత్తత తీసుకున్న ఇంగ్లాండ్ టెస్టు టీమ్, మొదటి రోజు 78 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 393/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది..

చేతిలో ఇంకా 2 వికెట్లు ఉన్నా, జో రూట్ అజేయ సెంచరీతో క్రీజులో ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ టీమ్. ఒకటిన్నర రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

ఐసీసీ నెం.1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ గోల్డెన్ డకౌట్ కాగా నెం.2 టెస్టు బ్యాటర్ స్టీవ్ స్మిత్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్ ఖవాజా... 321 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 141 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఉస్మాన్ ఖవాజాకి స్లిప్ ఫిల్డింగ్ సెట్ చేసిన రిజల్ట్ రాకపోవడంతో వారిని ముందుకు తీసుకొచ్చి, అతన్ని షాట్ ఆడకుండా కట్టడి చేశాడు బెన్ స్టోక్స్. తన ముందు 8 మంది ఫీల్డర్లు ఉండడంతో ఒత్తిడికి గురైన ఉస్మాన్ ఖవాజా, ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

ఉస్మాన్ ఖవాజా వికెట్ తీసిన తర్వాత గట్టిగా అరుస్తూ, కళ్లు ఉరిమి చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు ఓల్లీ రాబిన్‌సన్. 

‘ఇది నా మొదటి హోమ్ యాషెస్. సెంచరీ చేసిన వ్యక్తిని అవుట్ చేయడం ఎప్పుడూ స్పెషల్ మూమెంటే. ఉస్మాన్ ఖవాజా చాలా బాగా ఆడాడు. ఆ టైమ్‌లో అతని వికెట్ తీయడం టీమ్‌కి చాలా ముఖ్యం. అందుకే అంతలా సెలబ్రేట్ చేసుకున్నా...

అయినా గేమ్ థియేటర్‌లో ఇలాంటి డ్రామాలు చాలా అవసరం. అందుకే నేనుంది. ఉత్తిగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ పోతే మ్యాచ్‌లో ఇంట్రెస్ట్ రాదు. అప్పుడప్పుడూ ఇలాంటివి చేయాలి...

యాషెస్ ఇలాగే ఉంటుంది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో ఈ మాత్రం కూడా తట్టుకోలేకపోతే ఎలా? అయినా ఇది నేను మొదలెట్టింది కాదు. రికీ పాంటింగ్ కెప్టెన్సీని మనం చూస్తూ వచ్చాం...

రికీ పాంటింగ్ టీమ్‌లో ప్రతీ ప్లేయర్ కూడా ఇదే చేసేవాళ్లు. ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి ఇలాంటి అగ్రెషన్ చాలా అవసరం. నేను కూడా వారి బాటలోనే నడుస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్.. 

తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఓల్లీ రాబిన్‌సన్, బ్యాటింగ్‌లోనూ 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కడంతో బెన్ స్టోక్స్ తొందరపడి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి... 

PREV
click me!

Recommended Stories

తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..
INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం