ఎట్టకేలకు.. కలిసిపోయిన శ్రీశాంత్, హర్భజన్ సింగ్...!

By telugu news teamFirst Published Sep 17, 2022, 9:45 AM IST
Highlights

2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్.. శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  ఈ కారణంగా భజ్జీ ఆ సీజన్ మొత్తం నిషేధానికి గురయ్యాడు.

హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ఈ రెండు పేర్లు వినగానే... వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనే అందరికీ గుర్తుకువస్తుంది. 2008 ఐపీఎల్ సందర్భంగా హర్భజన్.. శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.  ఈ కారణంగా భజ్జీ ఆ సీజన్ మొత్తం నిషేధానికి గురయ్యాడు.  అంతేగాక భారత జట్టు కూడా అతడిపై 5  వన్డేల నిషేధం కూడా విధించింది. ఆ తర్వాత.. హర్భజన్ క్షమాపణలు కూడా చెప్పారు. కాగా... నిజానికి ఆ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య వైరం పెరిగిందని అందరూ అనుకున్నారు. అయితే... తాజాగా వీరిద్దరూ కలిసిపోయారు. కలిసి మ్యాచ్ కూడా ఆడారు.


కోల్‌కతాలోని ఈడెన్ గార్డెనాస్‌లో శుక్రవారం జరిగిన  లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ను కిక్‌స్టార్ట్ చేయడానికి ఇండియా మహారాజాస్ మరియు వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన బెనిఫిట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ మరియు శ్రీశాంత్ కలిసి ఆడారు. 2008 సంఘటన తర్వాత వీరిద్దరూ కలిసి ఆడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  ఆ ఐపీఎల్ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత హర్భజన్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ రోజుల్లో హర్భజన్ ముంబైకి ఆడుతుండగా, శ్రీశాంత్ పంజాబ్ జట్టులో సభ్యుడు కావడం గమనార్హం.

అప్పటి నుంచి వారి మధ్య వైరం పెరగగా... ఇటీవల కూడా హర్బజన్.. శ్రీశాంత్ కి క్షమాపణలు  చెప్పాడు. దీంతో.. వీరు మళ్లీ స్నేహితులుగా మారారు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి జట్టు గెలుపుకోసం ఆడారు. వారిద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ కలిసి మ్యాచ్ ఆడి జట్టును గెలిపించడం గమనార్హం

ఇదిలా ఉండగా... ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని శ్రీశాంత్‌పై ఆరోపణలు వచ్చాయి, అయితే అతను అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందాడు. అతడిపై బీసీసీఐ చాలా కాలం నిషేధం విధించింది. నిషేధం తొలగించబడింది కానీ క్రికెటర్ ఇప్పుడు అన్ని రకాల ఆటల నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

మ్యాచ్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని హర్భజన్ సింగ్ నేతృత్వంలోని మహారాజాస్ 18.4 ఓవర్లలో ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తన్మయ్ శ్రీవాస్తవ , యూసుఫ్ పఠాన్ హాఫ్ సెంచరీలతో మహారాజాస్ తరఫున బ్యాటింగ్ చేశారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఈరోజు తొలి మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

click me!