తండ్రైన యువరాజ్ సింగ్... హర్భజన్, గంభీర్ శుభాకాంక్షలు..!

Published : Jan 26, 2022, 01:08 PM IST
తండ్రైన యువరాజ్ సింగ్... హర్భజన్, గంభీర్ శుభాకాంక్షలు..!

సారాంశం

. యువరాజ్ సింగ్  పోస్టుకి.. హర్భజన్ సింగ్ స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు.  భజ్జీతో పాటు మహ్మద్ కైఫ్. గౌతమ్ గంభీర్ సహా.. పలువురు క్రికెటర్లు.,, వీరికి శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య హేజెల్ కీచ్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ట్విట్టర్ ఖాతాతో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ తమ గోప్యతను గౌరవించాలని కోరారు. 

‘దేవుడు మాకు కుమారుడిని ప్రసాదించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ తెలియజేయడం ఆనందంగా ఉంది అని యువరాజ్ ట్విట్టర్‌ తన ఆనందాన్ని తెలిపాడు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మా గోప్యతను గౌరవించాలని అడుగుతూ మా బిడ్డను ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము. లవ్, హాజెల్, యువరాజ్’ అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. యువరాజ్ సింగ్ తండ్రి అయినందుకు అందరు అభినందనలు తెలుపుతున్నారు.

 

కాగా.. యువరాజ్ సింగ్  పోస్టుకి.. హర్భజన్ సింగ్ స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు.  భజ్జీతో పాటు మహ్మద్ కైఫ్. గౌతమ్ గంభీర్ సహా.. పలువురు క్రికెటర్లు.,, వీరికి శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా.... టీ20 ప్రపంచకప్ 2007, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో హీరోగా నిలిచిన యువరాజ్ 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్‌పై ఒక ఓవర్‌లో 6 బంతుల్లో అతను 6 సిక్సర్లు బాదడం అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. గత ఏడాది T20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన తర్వాత 2022 ఫిబ్రవరి నుంచి క్రికెట్ మైదానంలోకి తిరిగి రావాలని యువరాజ్ సింగ్ సూచించాడు. 

యువరాజ్ అక్టోబర్ 2000లో కెన్యాపై వన్డేల్లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చివరిసారిగా జూన్ 2017లో వెస్టిండీస్‌తో ఆడాడు. 304 వన్డేల్లో అతను 14 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలతో సహా 55 సగటుతో 8701 పరుగులు చేశాడు. అదే సమయంలో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు అతని పేరు మీద ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !