గ్రూప్-ఏ బెర్త్‌లు ఖాయం.. రసవత్తరంగా గ్రూప్-బీ.. సూపర్ -12 వెళ్లే ఆ రెండు జట్లేవి..?

Published : Oct 20, 2022, 06:56 PM IST
గ్రూప్-ఏ బెర్త్‌లు ఖాయం.. రసవత్తరంగా గ్రూప్-బీ.. సూపర్ -12 వెళ్లే ఆ రెండు జట్లేవి..?

సారాంశం

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో అసలు సమరానికి వేళైంది.  ఈ ఆదివారం ప్రారంభమైన మెగా టోర్నీలో భాగంగా ప్రస్తుతం క్వాలిఫై రౌండ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. వీటిలో గ్రూప్ - ఏ నుంచి బెర్త్‌లు ఖాయమయ్యాయి. 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  రేపటితో  క్వాలిఫై రౌండ్ లు ముగియనున్నాయి.  ఈనెల 22 నుంచి సూపర్-12 పోటీలు ప్రారంభమవుతాయి. క్వాలిఫై రౌండ్ లో రెండు జట్ల నుంచి టాప్-2లో ఉన్న జట్లు ఈ దశకు అర్హత సాధిస్తాయి.  అర్హత రౌండ్ లో భాగంగా గ్రూప్ - ఏ (నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్)   నుంచి శ్రీలంక (ఏ1), నెదర్లాండ్స్ (ఏ2) సూపర్-12కు క్వాలిఫై అయ్యాయి.  కానీ గ్రూప్-బీ లో  నాలుగు జట్ల మధ్య  ఆసక్తికర పోటీ నెలకొన్నది. 

గ్రూప్-బీలో స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లున్నాయి. ఈ నాలుగు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడి  ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడాయి. ఈ నాలుగు జట్ల నుంచి  టాప్-2 లో నిలిచే జట్లేవి..? అనేది  ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో  రేపు  గ్రూప్-బీలో  జరుగబోయే రెండు  మ్యాచ్ లు నాలుగు జట్లకు కీలకం కానున్నాయి. శుక్రవారం ఉదయం  ఐర్లాండ్-వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. మద్యాహ్నం స్కాట్లాండ్ - జింబాబ్వే మధ్య  మ్యాచ్ ఉంది.  ఈ రెండు మ్యాచ్ లలో గెలిచిన  విజేతలు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.  

 

గ్రూప్- బీలో వెస్టిండీస్  తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో దారుణంగా ఓడి  తర్వాత మ్యాచ్ లో  జింబాబ్వేను ఓడించింది. రెండు సార్లు మాజీ ఛాంపియన్ అయిన విండీస్.. ఈ ప్రపంచకప్ లో క్వాలిఫై కావాలంటే రేపటి మ్యాచ్ తప్పకుండా నెగ్గాలి.  అయితే గత మ్యాచ్ లో  స్కాట్లాండ్ వంటి పటిష్ట జట్టుకు చుక్కలు చూపిన ఐర్లాండ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. 

 

 

PREV
click me!

Recommended Stories

Vaibhav Suryavanshi : 6 6 6 6 6 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన 14 ఏళ్ల కుర్రాడు !
T20 World Cup 2026 : ఏ ఐపీఎల్ టీం నుండి ఎక్కువమంది సెలెక్ట్ అయ్యారో తెలుసా?