గబ్బా టెస్టుకి వర్షం అడ్డంకి... వరుణుడి రాకతో నిలిచిన ఆట... రెండు వికెట్ల నష్టానికి...

Published : Jan 16, 2021, 11:42 AM IST
గబ్బా టెస్టుకి వర్షం అడ్డంకి... వరుణుడి రాకతో నిలిచిన ఆట... రెండు వికెట్ల నష్టానికి...

సారాంశం

మూడో సెషన్‌లో వర్షం అడ్డంకి... 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకి ఆలౌట్... ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకి 307 పరుగుల దూరంలో టీమిండియా...  

సిడ్నీ టెస్టులో ఓ సెషన్ మొత్తాన్ని తుడిచిపెట్టేసిన వరుణుడు, నాలుగో టెస్టులో కూడా ప్రత్యేక్షమయ్యాడు. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు టీ విరామం తర్వాత వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది.

నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకి ఆలౌట్ కాగా... భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన నటరాజన్, వాషింగ్టన్ సుందర్ చెరో మూడేసి వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ కూడా మూడు వికెట్లు తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 7, రోహిత్ శర్మ 44 పరుగులకు పెవిలియన్ చేరడంతో 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అజింకా రహానే 2, పూజారా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకి 307 పరుగుల దూరంలో ఉంది టీమిండియా.

PREV
click me!

Recommended Stories

WPL : స్మృతి, సోఫీలకు సాధ్యం కానిది నాట్ సీవర్ చేసి చూపించింది.. డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ
Tilak Varma : పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.. రోహిత్ శర్మ ఫేవరెట్ అతడే !