IPL: ముగిసిన క్రికెట్ పండుగ.. ఎవరెవరికి ఏ అవార్డులు..? బట్లర్ కు అగ్రస్థానం

Published : May 30, 2022, 10:18 AM IST
IPL: ముగిసిన క్రికెట్ పండుగ.. ఎవరెవరికి ఏ అవార్డులు..? బట్లర్ కు అగ్రస్థానం

సారాంశం

IPL2022 Awards: మార్చి 26 నుంచి మే 29 వరకు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్ లలో సాగిన ఐపీఎల్-15 ఆదివారం గుజరాత్ టైటాన్స్-రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తో ముగిసింది. మరి ఈ సీజన్ లో ఏ ఏ అవార్డులు ఎవరిని వరించాయో చూద్దాం. 

రెండు నెలలకు పైగా ముంబై, పూణె (లీగ్ దశ మొత్తం ఇక్కడే), కోల్కతా, అహ్మదాబాద్ లలో  జరిగిన ఐపీఎల్-15 ఆదివారం ముగిసింది.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఐపీఎల్-15 ట్రోఫీ నెగ్గకపోయినా రాజస్తాన్ రాయల్స్ పలు కీలక అవార్డులు సొంతం చేసుకుంది.  

ఈ సీజన్ లో అత్యధిక పరుగులతో పాాటు ప్లేయర్ ఆఫ్ ది సీజన్, ఇతర పలు అవార్డులను రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సొంతం చేసుకున్నాడు.  తన పేస్ తో సంచలనాలు సృష్టించిన  ఉమ్రాన్ మాలిక్.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా ఎన్నికయ్యాడు.  మొత్తం అవార్డుల జాబితా, ప్రైజ్ మనీని ఇక్కడ చూద్దాం. 

ఐపీఎల్-2022 అవార్డులు... ప్రైజ్ మనీ వివరాలు :

- ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) : జోస్ బట్లర్ (863 పరుగులు) - రూ. 10 లక్షలు 
- పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : బట్లర్ - రూ. 10 లక్షలు 
- అత్యధిక సిక్స్ లు : బట్లర్ - రూ. 10 లక్షలు 
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ : బట్లర్ - రూ. 10 లక్షలు
- గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : బట్లర్ - రూ. 10 లక్షలు
- మోస్ట్ ఫోర్స్ : బట్లర్ - రూ. 10 లక్షలు (ఇవన్నీ బట్లర్ కే రావడం విశేషం) 
- పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) : యుజ్వేంద్ర చాహల్ (27 వికెట్లు) - రూ. 10 లక్షలు
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : ఉమ్రాన్ మాలిక్ (ఎస్ఆర్హెచ్) - రూ. 10 లక్షలు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : దినేశ్ కార్తీక్ (ఆర్సీబీ) - రూ. 10 లక్షలు
- క్యాచ్ ఆఫ్ ది సీజన్ : ఎవిన్ లూయిస్ (లక్నో.. కేకేఆర్ తో మ్యాచ్ లో రింకూ సింగ్ క్యాచ్ పట్టినందుకు) - రూ. 10 లక్షలు
- ఫాస్టెస్ట్ డెలివరీ : లాకీ ఫెర్గూసన్  (గుజరాత్.. 157.3 కి.మీ) - రూ. 10 లక్షలు
- ఫేయిర్ ప్లే అవార్డు : రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 

ఐపీఎల్-15 లో  కొన్ని ప్రముఖ రికార్డులు : 

- అత్యధిక ఫోర్లు : బట్లర్ (83 ఫోర్లు)
- అత్యధిక సిక్సర్లు : బట్లర్ (45 సిక్సర్లు) 
- ఐపీఎల్-15 లో నమోదైన మొత్తం ఫోర్లు : 2,017 
- మొత్తం సిక్సర్లు  1,062 
- అత్యధిక స్కోరు : క్వింటన్ డికాక్ (140 నాటౌట్) 
- బెస్ట్ బౌలింగ్ : జస్ప్రీత్ బుమ్రా 10-5 (కేకేఆర్ పై) 
-  సెంచరీలు : 8.. ఇందులో నాలుగు బట్లర్ చేసినవి కాగా రెండు కెఎల్ రాహుల్ చేశాడు. రజత్ పాటిదార్, క్వింటన్ డికాక్ తలా ఒకటి  సాధించారు. 
- ఫిఫ్టీలు : 117 

ఐపీఎల్ -2022  ప్రైజ్ మనీ.. 

- విజేత : రూ. 20 కోట్లు (గుజరాత్) 
- రన్నరప్ : రూ. 13 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
- మూడో స్థానంలో నిలిచిన జట్టు : రూ. 7 కోట్లు (ఆర్సీబీ) 
- నాలుగో స్థానం జట్టుకు : రూ. 6.5 కోట్లు  (లక్నో) 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ