
ఐపీఎల్ సందడి ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా టీమ్ గా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్... ట్రోఫీ గెలిచి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎదుగుదల చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఫైనల్ మ్యాచ్ రోజు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసిన తీరు... ఆయనలోని న్యాయకత్వం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆదివారం, మే 29, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ 2022 ఫైనల్‌లో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై సునాయాసంగా విజయం సాధించింది. కాగా.. ఈ విజయం తర్వాత.., పాండ్యాపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ గా కూడా పాండ్యా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలడు అంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా ముందు నుండి 17 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా... కీలకమైన 34 పరుగులు చేయడంతో గుజరాత్ 131 పరుగుల తక్కువ లక్ష్యాన్ని 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ లో పాండ్యా భాగం కాలేదు. సీజన్ ప్రారంభంలో గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్ నియామకంపై అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. హార్దిక్ తన U-16 రోజుల నుండి పోటీ క్రికెట్‌లో ఏ జట్టుకు నాయకత్వం వహించలేదు. వెన్ను గాయం కారణంగా.. బౌలింగ్ సరిగా చేయలేడనే విమర్శలు వచ్చాయి.
అయితే... హార్దిక్ బ్యాట్, బాల్ రెండింటిలో సత్తా చాటడమే కాకుండా.. IPL 2022 సీజన్‌లో తమ జట్టును విజయం వైపు నడిపించాడు. హార్దిక్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా రిలాక్స్‌గా, ప్రశాంతంగా కనిపించాడు. తన ప్రశాంతంత తన టీమ్ కి కూడా బాగా కలిసొచ్చింది.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను వారి తొలి సీజన్‌లో అందించిన తర్వాత సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కేవలం తన అంచనాలు మాత్రమే కాదు.. అందరి అంచనాలను హార్దిక్ దాటేశాడని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. నాయకుడిగా... హార్దిక్ కీర్తి అమాంతం పెరిగిపోయిందని ఆయన చెప్పారు.
"అతను బ్యాట్‌తో ఏమి చేయగలడో, బంతితో ఏమి చేయగలడో మనందరికీ తెలుసు, కానీ సీజన్ ప్రారంభానికి ముందు అతను తన 4 ఓవర్ల పూర్తి కోటాను బౌలింగ్ చేయగలడా అనే దాని గురించి కొంచెం ఆందోళన ఉంది. . అది చేసి చూపించాడు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
‘పాండ్యా జట్టును నడిపించిన విధానం, అతను వారిని ఒకచోట చేర్చిన విధానం, అతను వారిని గెల్ చేసిన విధానం చూస్తే.. అతనిలోని నాయకత్వ లక్షణాల బయటపడతాయి.’’ అని గవాస్కర్ చెప్పారు.
ఇంతటి నాయకత్వ లక్షణాలు ఉంటే.. టీమిండియాకి కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.