నాలుగో వికెట్ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టారూ... డీఆర్‌ఎస్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్...

Published : Jan 10, 2021, 06:43 AM IST
నాలుగో వికెట్ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టారూ... డీఆర్‌ఎస్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్...

సారాంశం

స్టీవ్ స్మిత్ అవుట్ కోసం అప్పీలు చేసిన టీమిండియా... బ్యాట్స్‌మెన్ వెనకాల నాలుగు వికెట్లు ఉన్నట్టు చూపించిన డీఆర్‌ఎస్ హాక్ ఐ... అంపైర్ కాల్‌గా ప్రకటించడంతో బతికిపోయిన స్టీవ్ స్మిత్...

పెళ్లిలో మూడు ముళ్లు... క్రికెట్‌లో మూడు వికెట్లు... అయితే ఆస్ట్రేలియా టూర్‌లో మాత్రం నాలుగో వికెట్ ప్రత్యేక్షమైంది. నాన్‌-స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉండే వికెట్లలో నుంచి మరో వికెట్ వచ్చి పడిందని అనుకోకండి. ఇది డీఆర్‌ఎస్ (డిసిషెన్ రివ్యూ సిస్టమ్) రేపిన రచ్చ.

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అవుట్ కోసం అప్పీలు చేసింది టీమిండియా. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూకి వెళ్లింది టీమిండియా. అయితే థర్డ్ అంపైర్ పరిశీలన కోసం వాడే హక్ ఐ టెక్నాలజీలో బ్యాట్స్‌మెన్ వెనకాల నాలుగు వికెట్లు ఉన్నట్టు కనిపించింది.

బ్యాట్స్‌మెన్‌ను బంతి తగిలిన తర్వాత అక్కడి నుంచి బంతి వెళ్లే దిశగా గ్రాఫిక్‌లో డిజైన్ చేస్తారు. అయితే స్మిత్ వెనకున్న వికెట్లను గ్రాఫిక్‌లో డిజైన్ చేయడంలో డిజైనర్ చేసిన పొరపాటు కారణంగా మూడు వికెట్లు కాస్తా... నాలుగు వికెట్లుగా కనిపించాయి. ఈ నాలుగు వికెట్ల డీఆర్‌ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ తెరతీసింది. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే