భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.. కోహ్లీ తిరుగులేని సారథి: బ్రియాన్ లారా

By Siva KodatiFirst Published Oct 18, 2019, 2:11 PM IST
Highlights

ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోందని అత్యుత్తమ వ్యక్తులు ప్రభావం చూపిస్తున్నారని లారా వ్యాఖ్యానించాడు. 1970, 80 దశకాల్లో విండీస్, 90, 20వ దశకం మొదట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాయని.. ప్రస్తుతం టీమిండియా శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుందని లారా ప్రశంసించాడు. 

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. కోహ్లీ తిరుగులేని సారథని.. పరుగులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపాడు.

ధోనీ నాయకత్వంలో ఎంతో నేర్చుకున్నాడని .. మైదానం బయటా బాగుంటున్నాడని లారా కొనియాడాడు. ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోందని అత్యుత్తమ వ్యక్తులు ప్రభావం చూపిస్తున్నారని లారా వ్యాఖ్యానించాడు.

1970, 80 దశకాల్లో విండీస్, 90, 20వ దశకం మొదట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాయని.. ప్రస్తుతం టీమిండియా శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుందని లారా ప్రశంసించాడు.

రవిశాస్త్రి ఏం చేశాడని మాట్లాడాలి..? గంగూలీ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే భారత్‌ను అడ్డుకోగలవని అభిప్రాయపడ్డాడు. 2016లో టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించిన భారత్..ఆ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో కృషి చేసిందని లారా తెలిపాడు.

బుమ్రా, ఇషాంత్, షమితో కూడి పేస్ విభాగం నాటి విండీస్ బౌలర్లను గుర్తు చేస్తున్నారని బ్రియాన్ లారా కొనియాడాడు. వన్టే, టీ20, టెస్టులు ఇలా మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ అందమైన ఆటగాడని.. అలాంటి ఆటగాడు రిజర్వ్ బెంచీపై ఉండటం కష్టమని పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్ షిప్ ముందే వచ్చుంటే బాగుండేదని లారా అభిప్రాయపడ్డాడు. పసికూనలైన ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఆటకు కూడా ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. ఇది క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తోందని లారా తెలిపాడు.

కీరన్ పొలార్డు విండీస్ టీ20 కెప్టెన్‌గా ఎంపికవ్వడం శుభపరిణామమని.. అతని సారథ్యంలో వెస్టిండీస్ తిరిగి పుంజుకుంటుందని బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు.

మాట నిలబెట్టుకున్న సెహ్వాగ్: పుల్వామా అమరవీరుల పిల్లలకు ఉచిత విద్య, నెటిజన్లు ఫిదా

మరోవైపు మాజీ క్రికెట్ దిగ్గజాలతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ టీ20కి రంగం సిద్ధమయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 16 వరకు ముంబై, పుణే వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీని ఇండియా లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, విండీస్ లెజెండ్స్‌గా విభజించారు.

ఈ లీగ్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ లీగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రోడ్డు భద్రతా అవగాహన కోసం పనిచేస్తున్న ‘‘ శాంతి భారత్ సురక్షిత్ భారత్’’ అనే సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. 

click me!