చేసిందంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న పాకిస్తాన్.. అర్ష్‌దీప్‌కు మద్దతుగా ఉండాలని చిలుకపలుకులు

Published : Sep 05, 2022, 04:15 PM IST
చేసిందంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న పాకిస్తాన్.. అర్ష్‌దీప్‌కు మద్దతుగా ఉండాలని చిలుకపలుకులు

సారాంశం

Arshdeep Singh: టీమిండియా యువ పేసర్  అర్ష్‌దీప్ సింగ్ ‘ఖలిస్తాని’ అని  వికిపీడియాలో ఎడిట్ చేసి అడ్డంగా దొరికిపోయింది పాకిస్తాన్. కానీ ఆ దేశ క్రికెటర్లు మాత్రం మొసలికన్నీరు కారుస్తున్నారు. 

ఆసియా కప్-2022లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో ఒత్తిడిలో క్యాచ్ మిస్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ పై ట్రోలింగ్  కు దిగిన పాకిస్తాన్ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నది.  కుట్ర ప్రకారం.. అర్ష్‌దీప్ వికిపీడియా పేజీలో  అతడి ఐడెంటిటీని మార్చిన పాకిస్తాన్.. ఇప్పుడు అతడికి మద్ధతుగా నిలబడుతూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నది.  ఈ మ్యాచ్  అనంతరం భారత అభిమానులు అర్ష్‌దీప్ పై  ఆగ్రహంగా ఉన్న విషయాన్ని సొమ్ము చేసుకోవడానికి పాకిస్తాన్ కు చెందిన  నెటిజన్ ఒకరు.. అర్ష్‌దీప్ ఐడెంటిటీని ‘ఖలిస్తాని’గా  ఎడిట్ చేశాడు.  ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది. 

తాజాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ హఫీజ్  అర్ష్‌దీప్ కు మద్దతుగా నిలవడం గమనార్హం.  టీమిండియా యువ పేసర్ పై  సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో  హఫీజ్ తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందించాడు. 

హఫీజ్ స్పందిస్తూ.. ‘భారత అభిమానులకు నా మనవి ఏమిటంటే.. క్రీడలలో తప్పులు జరగడం సహజం. మేమూ మనుషులమే. ఆటగాళ్ల తప్పుల ఆధారంగా  వారిని అవమానపరచకండి.. ప్లీజ్..’ అని  ట్వీట్ చేశాడు. 

 

అయితే ఈ ట్వీట్ కు భారత అభిమానులు స్పందించారు. తమకు పాకిస్తాన్ జాలి అవసరం లేదని, ముందు మీరు మొసలి కన్నీరు కార్వడం మానండని 
సూచిస్తున్నారు.  ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘మీ జాలి మాకేం అవసరం లేదు. అర్ష్‌దీప్ ను ఎవరూ అవమానించడం లేదు. అతడు తన తర్వాత మ్యాచ్ లో బలంగా పుంజుకుంటాడు.  ఈలోగా మీరు మీ అస్తిత్వ పోరాటాన్ని కొనసాగించండి..’ అని ట్వీట్ చేశాడు.  

ఇదిలాఉండగా అర్ష్‌దీప్ రెప్యుటేషన్ ను దెబ్బతీసే విధంగా అతడికి ‘ఖలిస్తాన్’ గ్రూప్ తో సంబంధాలు అంటగడుతున్నారు. వికిపీడియాలో అతడిని ఖలిస్తాన్  సభ్యుడిగా చిత్రీకరిస్తూ ఎడిట్ చేశారు.  దీనిపై  కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  వికిపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది.  అర్ష్‌దీప్ కు సంబంధించిన వికిపీడియా పేజీలో.. 2018 అండర్-19 లో అతడు ఖలిస్తాన్ తరఫున  అరంగేట్రం చేసినట్టు ఎడిట్ చేశారు కొందరు దుండగులు. అంతేగాక 2022 జులైలో ఖలిస్తాన్ జట్టుకు ఆడాడని, ఆసియా కప్ లో కూడా ఖలిస్తాన్ తరఫునే పోటీ పడుతున్నాడని ఎడిట్ చేశారు.  

 

దీనివెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని తెలుస్తున్నది. ఈ మేరకు అన్షుల్ సక్సేనా అనే ఓ  ట్విటర్ యూజర్ అందుకు గల ఆధారాలను బయటపెట్టాడు.  అర్ష్‌దీప్ వికిపీడియా పేజీలో మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయో వివరించాడు. ఈ పేజీని ఎడిట్ చేసింది పాకిస్తాన్ నుంచే అని.. పాక్ లోని పంజాబ్ రీజియన్ లో ముర్రె అనే నగరంలోంచి ఓ వ్యక్తి  ఈ పని చేశాడని స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. అందులో సదరు  ఎడిట్ చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ పాకిస్తాన్ టెలి కమ్యూనికేషన్ అని  సూచిస్తుండటం గమనార్హం. 

ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్  బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 17వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా.. మహ్మద్ రిజ్వాన్ ను ఔట్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ.. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో  మూడో బంతికి భారీ షాట్ కు యత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్.. సింపుల్ క్యాచ్ ను జారవిడిచాడు.  ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత అసిఫ్ అలీ రెచ్చిపోయి పాకిస్తాన్ కు విజయాన్ని అందించాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..
ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా