Arshdeep Singh: అర్ష్‌దీప్‌ ‘ఖలిస్తాని’ అంటూ పోస్టులు.. వికిపీడియాకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు

Published : Sep 05, 2022, 02:26 PM IST
Arshdeep Singh: అర్ష్‌దీప్‌ ‘ఖలిస్తాని’ అంటూ పోస్టులు.. వికిపీడియాకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు

సారాంశం

India vs Pakistan: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తుండటంపై కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆదివారం దుబాయ్ వేదికగా ముగిసిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో కీలకమైన అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ ను  జారవిడవడంతో  అర్ష్‌దీప్ సింగ్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అర్ష్‌దీప్ వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.  అయితే ఇది ట్రోల్స్ వరకే ఆగకుండా అతడి రెప్యుటేషన్ ను దెబ్బతీసే విధంగా అర్ష్‌దీప్ కు ‘ఖలిస్తాన్’ గ్రూప్ తో సంబంధాలు అంటగడుతున్నారు. వికిపీడియాలో అతడిని ఖలిస్తాన్  సభ్యుడిగా చిత్రీకరిస్తూ ఎడిట్ చేశారు.  దీనిపై  కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  వికిపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. 

అర్ష్‌దీప్ కు సంబంధించిన వికిపీడియా పేజీలో.. 2018 అండర్-19 లో అతడు ఖలిస్తాన్ తరఫున  అరంగేట్రం చేసినట్టు ఎడిట్ చేశారు కొందరు దుండగులు. అంతేగాక 2022 జులైలో ఖలిస్తాన్ జట్టుకు ఆడాడని, ఆసియా కప్ లో కూడా ఖలిస్తాన్ తరఫునే పోటీ పడుతున్నాడని ఎడిట్ చేశారు.  

ఈ యువ పేసర్ వికిపీడియా పేజీలో కూడా దేశం అనేదగ్గర ఇండియాను తీసేసి ఖలిస్తాన్ పంజాబ్ అని  ఎడిట్ చేశారు. అయితే దీనివెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని తెలుస్తున్నది. ఈ మేరకు అన్షుల్ సక్సేనా అనే ఓ  ట్విటర్ యూజర్ అందుకు గల ఆధారాలను బయటపెట్టాడు.  అర్ష్‌దీప్ వికిపీడియా పేజీలో మార్పులు ఏ విధంగా చోటు చేసుకున్నాయో వివరించాడు. ఈ పేజీని ఎడిట్ చేసింది పాకిస్తాన్ నుంచే అని.. పాక్ లోని పంజాబ్ రీజియన్ లో ముర్రె అనే నగరంలోంచి ఓ వ్యక్తి  ఈ పని చేశాడని స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. అందులో సదరు  ఎడిట్ చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ పాకిస్తాన్ టెలి కమ్యూనికేషన్ అని  సూచిస్తుండటం గమనార్హం. 

 

ఇదిలాఉండగా ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ష్‌దీప్ ను ఖలిస్తాన్ గా చిత్రీకరించడానికి వీలు కల్పించిన (ఎడిట్ చేసుకునేందుకు) వికిపీడియా  ప్రతినిధులకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.  అర్ష్‌దీప్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది పాకిస్తాన్ నుంచే అని గుర్తించిన ఐటీ శాఖ.. దానిపైనా వివరాలనూ సేకరిస్తోంది. 

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్  బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో   17వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా.. మహ్మద్ రిజ్వాన్ ను ఔట్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ.. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో  మూడో బంతికి భారీ షాట్ కు యత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్.. సింపుల్ క్యాచ్ ను జారవిడిచాడు.  ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. అప్పటికే రిజ్వాన్ వికెట్ కోల్పోవడంతో కొంత ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్.. అసిఫ్ అలీ కూడా ఔటై ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో.. కానీ అర్ష్‌దీప్ క్యాచ్ మిస్ చేయడం వల్ల అసిఫ్ అలీ రెచ్చిపోయాడు.  తనకు దొరికిన లైఫ్ తో అతడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు